ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google) తమ ఉద్యోగుల విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ అత్యంత వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు మారుతున్న తరుణంలో.. ఆ వేగాన్ని అందుకోలేని వారు లేదా కంపెనీ లక్ష్యాలతో ఏకీభవించని వారు స్వచ్ఛందంగా తప్పుకునేలా 'వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్' (VEP) ను ప్రకటించింది. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ పంపిన అంతర్గత మెమో ఇప్పుడు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
'ఆల్ ఇన్' కావాలి.. లేదంటే తప్పుకోవాలి!
గూగుల్ గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ (GBO) లోని ఉద్యోగులకు పంపిన ఈ మెమోలో షిండ్లర్ స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. 2025 లో కంపెనీ మంచి ఫలితాలను సాధించినప్పటికీ.. ప్రస్తుతం టెక్ ప్రపంచం చాలా వేగంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ 'AI ఫస్ట్' రేసులో ప్రతి ఉద్యోగి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని, కంపెనీ వేగాన్ని ఎంజాయ్ చేయలేని వారు లేదా ఇతర మార్గాలను చూసుకోవాలనుకునే వారు సెవరెన్స్ ప్యాకేజీ తీసుకుని గౌరవప్రదంగా వెళ్లిపోవచ్చని ఆయన సూచించారు.
ఏయే విభాగాలపై ప్రభావం ఉంటుంది?
ఈ తాజా ఎగ్జిట్ ప్యాకేజీ ప్రధానంగా సొల్యూషన్స్ టీమ్స్, సేల్స్, కార్పొరేట్ డెవలప్‌మెంట్ విభాగాల్లోని ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంది. అయితే కస్టమర్లతో నేరుగా సంబంధం ఉండే అమెరికా లార్జ్ కస్టమర్ సేల్స్ టీమ్స్ వంటి కొన్ని కీలక విభాగాలకు ఈ ప్లాన్ వర్తించదు. కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
ఏడాదిలోనే మూడవసారి.. గూగుల్ వ్యూహం ఏంటి?
గూగుల్ ఏడాది కాలంలో ఇలాంటి ఎగ్జిట్ ప్లాన్ ప్రకటించడం ఇది మూడవసారి. 2025 జూన్ లో ఆఫీస్ నుంచి పని చేయాలనే నిబంధనలు కఠినతరం చేసినప్పుడు మొదటిసారి.. అక్టోబర్ లో యూట్యూబ్ పునర్వ్యవస్థీకరణ సమయంలో రెండవసారి ఇలాంటి ప్యాకేజీలను ఆఫర్ చేసింది. బలవంతంగా ఉద్యోగులను తొలగించడం కంటే (Layoffs), స్వచ్ఛందంగా వెళ్లాలనుకునే వారికి ఆర్థిక సాయంతో కూడిన ప్యాకేజీలు ఇవ్వడం ద్వారా వర్క్ ఫోర్స్ ను క్రమబద్ధీకరించాలని గూగుల్ (Google) భావిస్తోంది.

మొత్తంగా చూస్తే.. గూగుల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియోనా సిక్కోని ప్రకారం.. ఇప్పటికే మార్కెటింగ్, సెర్చ్ , హార్డ్‌వేర్ విభాగాల్లో సుమారు 5 శాతం మంది ఉద్యోగులు ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్లాన్ ను ఎంచుకున్నారు. చాలా మంది తమ కెరీర్ లో విరామం తీసుకోవడానికి లేదా కుటుంబ సభ్యుల సంరక్షణ కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని ఆమె తెలిపారు. మొత్తం మీద గూగుల్ ఇప్పుడు తన శ్రమని, శక్తిని పూర్తిగా AI మిషన్ వైపు మళ్లించే పనిలో పడింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications