AI News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతోంది. గణాంకాల ప్రకారం రానున్న రోజుల్లో మానవ ప్రమేయం ఉన్న పలు ఉద్యోగాలు ఊడిపోనున్నాయి. అదే సమయంలో ప్రొడక్టివిటీకి భారీ స్థాయిలో బూస్ట్ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఆయా దిగ్గజ కంపెనీలు తమ స్వంత AI రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. ఈ సమయంలో పోటీదారులకు షాక్ ఇస్తూ, గూగుల్ బాస్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు.
గూగుల్ తయారు చేసిన కృత్రిమ-ఇంటెలిజెన్స్ మోడల్ జెమినీని ఐఫోన్‌తో అనుసంధానించడానికి చర్చలు జరుగుతున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ ఏడాది ఉత్పత్తి కానున్న ఐఫోన్లలో జెమినీ-ఆధారిత ఫీచర్లను పరిచయం చేసే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ చర్చలపై ఆపిల్ లేదా గూగుల్ ప్రతినిధులు స్పందించలేదని తెలిపింది.

OpenAI మోడల్‌ను ఉపయోగించడం గురించి కూడా ఆపిల్ ఆలోచించినట్లు నివేదిక పేర్కొంది. ఇటీవల ChatGPT తయారీదారుతో చర్చలు కూడా జరిపినట్లు వెల్లడించింది. అయితే ఆపిల్‌తో గూగుల్ ఒప్పందం ఖరారైతే, మార్కెట్లోని ప్రత్యర్థులు సామ్ ఆల్ట్‌మన్‌కు చెందిన OpenAI మరియు ఎలాన్ మస్క్ xAIకు సుందర్ పిచాయ్ జెమినీ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
గత నెల జెమినీ చాట్‌బాట్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ దెబ్బతో ఈ AI మోడల్ ఇమేజ్-జనరేషన్ ఫీచర్‌ను పాజ్ చేసింది. దీంతో మెరుగైన సంస్కరణలతో త్వరలోనే తిరిగి విడుదల చేస్తామని వినియోగదారులకు హామీ ఇచ్చింది. కాగా ఈ ఒప్పందం గూగుల్‌కు ఓదార్పునిస్తుందని అంచనా.
ఇదే సమయంలో ఎలాన్ మస్క్ రంగలోకి దిగి ప్రత్యర్థి కంపెనీలపై విమర్శలు గుప్పించారు. గూగుల్ AI జాత్యహంకారి అని, జెమినీ AI ఇమేజ్ జనరేషన్ అనేది గూగుల్ యొక్క పిచ్చి జాత్యహంకార, నాగరికత వ్యతిరేక కార్యక్రమాలను అందరికీ స్పష్టం చేసిందన్నారు. మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం కలిగి OpenAI దాని లాభాపేక్షలేని లక్ష్యాన్ని ఉల్లంఘించిందంటూ కంపెనీ సహా దాని CEO సామ్ ఆల్ట్‌మాన్‌పై దావా వేశారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications