For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో సెర్చింజన్ గూగుల్ డార్క్ మోడ్

|

తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త అనుభూతిని అందించే గూగుల్ వినూత్న ఆలోచనలు చేస్తోంటోంది. ఇప్పటికే మొబైల్ ఓఎస్‌లో పలు కొత్త ఫీచర్స్ తీసుకు వచ్చిన ఈ సెర్చింజన్ దిగ్గజం తాజాగా క్రోమ్ డెస్క్ టాప్/వెబ్ వర్షన్ యూజర్ల కోసం డార్క్ మోడ్‌ను తీసుకు వస్తోంది. ఇప్పుడు యూజర్లు సిస్టం థీమ్‌ను డార్క్ మోడ్‌లో పెట్టుకోవచ్చు. అప్పుడు గూగుల్ క్రోమ్ డెస్క్ టాప్/వెబ్ సెర్చ్ ఆటోమేటిగ్గా డార్క్ మోడ్‌లోకి వెళ్తుంది.

సిస్టం సెట్టింగ్స్‌ను బట్టి డార్క్ మోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీంతో బ్యాటరీ డివైజ్ లైఫ్ ఆదా అవుతుంది. ఇది ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉంది. త్వరలో అందుబాటులోకి రానుంది. బీటా యూజర్ అయితే గూగుల్ సెర్చ్ లేదా వెబ్ పేజీ ఓపెన్ చేస్తే డార్క్ మోడ్ వచ్చినట్లు ఓ నోటిఫికేషన్ అందుతుంది. దానిపై క్లిక్ చేసి ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడు డార్క్ మోడ్ సక్రియమవుతుంది. సెర్చ్ పేజీ డార్క్‌లోకి మారుతుంది. బీటా యూజర్ కాకపోతే క్రోమ్ సెట్టింగ్స్‌లో ఫోర్స్ డార్క్ మోడ్ ఆప్షన్‌ ద్వారా ప్రయత్నం చేయవచ్చు.

Google Adds Dark Mode Functionality To Chrome

క్రోమ్ యూజర్లు అయితే మెసేజ్ వస్తుంది. డార్క్ మోడ్ ఇప్పుడు అందుబాటులో ఉంది అని వస్తే ఆప్షన్‌ను టర్న్ ఆన్ చేయవచ్చు. క్రోమ్ యూజర్లు అందరికీ డార్క్ మోడ్ టర్న్ ఆన్ ఆప్షన్ రాకపోవచ్చు.

English summary

త్వరలో సెర్చింజన్ గూగుల్ డార్క్ మోడ్ | Google Adds Dark Mode Functionality To Chrome

Dark Mode is the new trend in all-new tech interfaces and a major part of the future of UX and UI design.
Story first published: Thursday, March 11, 2021, 22:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X