Google: అనుకోకుండా హ్యాకర్‌కు రూ.2 కోట్లు చెల్లించిన గూగుల్.. తర్వాత ఏం జరిగిందంటే..!
Google: మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి నెల గడిస్తే ఏం చేస్తారు. అవి ఎలా వచ్చాయో తెలుసుకోకుండా వాడేస్తారు. మహా అయితే మనకు తెలిసివారే ఎవరైనా బకాయి ఉంటే వేసి ఉంటారని సరిపెట్టుకుంటాం. కానీ ఒక హ్యాకర్ అలా చేయలేదు. గూగుల్ తనకు అనవసరంగా కోట్లు ఇచ్చిందంటూ ప్రకటన చేయటం సంచలనంగా మారింది. అసలు ఈ మ్యాటర్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

హ్యాకర్ మాట ఇలా..
తనకు మూడు వారాల కిందట గూగుల్ నుంచి రూ.2 కోట్లు వచ్చాయని ఒక హ్యాకర్ ట్విట్టర్ వేధికగా ప్రకటించాడు. యాదృచ్ఛికంగా గూగుల్ అతని ఖాతాలోకి 2.50 లక్షల డాలర్లను జమచేసిందని ట్విట్టర్ వేధికగా తెలిపాడు. అయితే టెక్ దిగ్గజం తనకు ఎందుకు ఇంత భారీ మెుత్తాన్ని ఇచ్చిందో తెలిదని సామ్ కర్రీ అంటున్నాడు
ట్విట్టర్లో వెల్లడించిన వివరాలు..
"గూగుల్ యాదృచ్ఛికంగా నాకు $249,999 పంపి 3 వారాలకు పైగా గడిచింది. సపోర్ట్ టిక్కెట్‌పై నేను ఇంకా ఏమీ వినలేదు. మేము Googleని సంప్రదించడానికి ఏదైనా మార్గం ఉందా" అని కర్రీ మంగళవారం ట్వీట్ చేశారు. ఈ లావాదేవీకి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను అతడు తన ట్వీట్ లో పంచుకున్నాడు. ఈ వార్త చూసినవారందరూ ఇప్పుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు.

అసలీ హ్యాకర్ ఎవరు..
కర్రీ నెబ్రాస్కాలోని ఒమాహాలో యుగా ల్యాబ్స్ సిబ్బంది సెక్యూరిటీ ఇంజనీర్. అతను బగ్ బౌంటీ హంటింగ్‌లో పాలుపంచుకుంటానని చెప్పాడు. అనేక కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌లో బగ్‌లు లేదా భద్రతా లోపాలను కనుగొనే వ్యక్తులకు ఆర్థిక బహుమతి అందిస్తుంటాయి. అలా తాను గతంలో గూగుల్ కోసం బగ్ బౌంటీ హంటింగ్ చేశానని.. అయితే దానికి ఇప్పుడు అకౌంట్లోకి వచ్చిన డబ్బుకు మధ్య సంబంధం ఏమిటో గుర్తించలేకపోయానని అంటున్నాడు.

వీడిన మిస్టరీ..
అసలు ఎందికిలా జరిగిందా అని అతడు తలబద్దలు కొంటుకుని చివరికి ఇలా విషయాన్ని బయటకు చెప్పటంతో గూగుల్ దీనిపై స్పందించింది. ఒక మానవ తప్పిదం కారణంగా గూగుల్ తప్పుడు పార్టీకి అనుకోకుండా చెల్లింపు చేసినట్లు ధృవీకరించడంతో మిస్టరీ వీడింది. ఈ విషయాన్ని వెల్లడించింనందుకు కర్రీని కంపెనీ ప్రతినిధి అభినందించారు. ప్రస్తుతం దీనిని సరిదిద్ధటానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.


Click it and Unblock the Notifications