మీరు యుపిఐ ద్వారా పేమెంట్స్ చేస్తున్నారా అయితే ఈ వార్త మీ కోసమే. డిజిటల్ పేమెంట్స్ మరింత సులభం ఇంకా ఉపయోగకరంగా మార్చేందుకు యుపిఐ ట్రాన్సక్షన్స్ సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వ్యాపారులకు, సాధారణ కస్టమర్లకు ఇద్దరికీ కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

ఆర్‌బిఐ కొత్త ఆదేశం ఏంటి : బ్యాంకులతో సంప్రదించిన తర్వాత పర్సన్ టు మర్చంట్ (P2M అండ్ M2M), మర్చంట్ టు మర్చంట్ ట్రాన్సక్షన్స్ లిమిట్ పెంచడానికి లేదా తగ్గించడానికి RBI ఇప్పుడు NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అధికారం ఇచ్చింది. ఇప్పటివరకు ఈ రెండు రకాల ట్రాన్సక్షన్స్ లిమిట్ రూ.1 లక్ష ఉండేది, కానీ ఇప్పుడు దానిని రూ.2 లక్షల వరకు లేదా రూ.5 లక్షల వరకు పెంచవచ్చు.
సామాన్యులకు ఉన్న రూల్ ఏంటి : సాధారణ ప్రజలకి అంటే పర్సన్-టు-పర్సన్ (P2P) ట్రాన్సక్షన్స్ లిమిటీలో ఎటువంటి మార్పు లేదని RBI స్పష్టం చేసింది. అంటే ఇప్పుడు UPI ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి గరిష్టంగా రూ.1 లక్ష వరకు పంపవచ్చు.
UPI లిమిట్ ప్రస్తుత స్టేటస్ : P2P అంటే ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి 1 లక్ష, అలాగే P2M అంటే ఒక వ్యక్తి నుండి వ్యాపారికి 1 లక్ష (ప్రస్తుతం), M2M (వ్యాపారి నుండి మరొక వ్యాపారికి) రూ.1 లక్ష (ప్రస్తుతం)
బిజినెస్ క్లాస్ కు అతిపెద్ద ప్రయోజనం: ఈ మార్పు వల్ల వ్యాపారులు అతిపెద్ద ప్రయోజనం పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు వ్యాపారులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్సక్షన్ చేయవచ్చు. ఈ బెనిఫిట్ ముఖ్యంగా ఆన్‌లైన్ వ్యాపారాలు, జ్యువెలరీ షాపులు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లు ఇంకా ఇతర పెద్ద వ్యాపారాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ఊతం : ఈ చర్య భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఎక్కువ మంది క్యాష్ కంటే డిజిటల్ పేమెంట్స్ ఇష్టపడుతున్నారు, దీని వల్ల పారదర్శకత పెంచుతుంది ఇంకా పేమెంట్ సిస్టం బలోపేతం చేస్తుంది.
బ్యాంకులకు కొత్త బాధ్యత : ట్రాన్సక్షన్స్ లిమిట్ ఇప్పుడు పెరిగే ఛాన్స్ ఉండటంతో బ్యాంకులు వాటి టెక్నీకల్ సెక్యూరిటీ ఇంకా స్ట్రాంగ్ సిస్టం పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది, ఎందుకంటే దీని ద్వారా మోసాలను నివారించవచ్చు.
NPCIకి కీలక బాధ్యత : ఇప్పుడు NPCI మార్కెట్ డిమాండ్ ప్రకారం ఇంకా బ్యాంకులతో చర్చించడం ద్వారా UPI ట్రాన్సక్షన్ లిమిట్ మార్చే అధికారాన్ని పొందింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications