Gold Rates: దూకుడు మెుదలెట్టిన గోల్డ్.. లేట్ లేకుండా కొనుక్కోండి.. తాజా ధరలు..
Gold Rates: గత నెల రెండవ అర్ధ భాగంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా తగ్గటం కొనసాగించాయి. అంతర్జాతీయ పరిణామాలు ఇందుకు కారణంగా ఉన్నాయి. ఫెడ్ రేట్ల దూకుడుతో ఇన్వెస్టర్లు బాండ్ మార్కెట్లకు షిఫ్ట్ కావటం కూడా దీనికి కారణంగా ఉంది.
అయితే కొత్త నెల ప్రారంభంలో మాత్రం మళ్లీ బంగారం ధరలు క్రమంగా పుంజుకోవటం ప్రారంభించాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.200 వరకు పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో తాజా రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,440, ముంబైలో రూ.54,150, దిల్లీలో రూ.54,300, కలకత్తాలో రూ.54,150, బెంగళూరులో రూ.54,150, వడోదరలో రూ.54,200, జైపూర్ లో రూ.54,300, కోయంబత్తూరులో రూ.54,440, నాగపూర్ లో రూ.54,150, నాశిక్ లో రూ.54,180, బళ్లారిలో రూ.54,150, గురుగ్రామ్ లో రూ.54,300గా కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధరలు 10 గ్రాములకు రూ.220 వరకు పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో తాజా రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.59,350, ముంబైలో రూ.59,070, దిల్లీలో రూ.59,220, కలకత్తాలో రూ.59,070, బెంగళూరులో రూ.59,070, వడోదరలో రూ.59,120, జైపూర్ లో రూ.59,220, కోయంబత్తూరులో రూ.59,350, నాగపూర్ లో రూ.59,070, నాశిక్ లో రూ.59,100, బళ్లారిలో రూ.59,070, గురుగ్రామ్ లో రూ.59,220గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలను పరిశీలిద్దా. ఆంధ్రప్రదేశ్ నగరాలైన విజయవాడ, అనంతపురం, తిరుపతి, విశాఖ, కాకినాడ, నెల్లూరులలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,150గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,070గా ఉంది. ఇక తెలంగాణ నగరాలైన హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ లలో కూడా ఇవే రేట్ల వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.
ఇక వెండి ధరలను పరిశీలిస్తే దేశంలో కిలోకి ధర నిన్నటి కంటే రూ.500 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.75,700 వద్ద విక్రయించబడుతోంది. గత నెల చివర్లో స్థిరంగా కొనసాగిన ధరలు మళ్లీ పెరుగుదలను నమోదు చేయటం ప్రారంభించాయి.


Click it and Unblock the Notifications