Gold Rate: జూలై 17 నుంచి ఈ ఏడాది శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మళ్లీ పెళ్లిళ్లు, శుభకార్యాలు తిరిగి మెుదలవుతున్న తరుణంలో బంగారం కొనుగోలుకు ప్రాముఖ్య పెరుగుతోంది.
గత కొన్ని రోజులుగా బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ.. తగ్గుతూ మెుత్తానికి స్థిరంగానే కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాలు సైతం దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరుగుదలను కొనసాగిస్తున్నాయి.

ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,820, ముంబైలో రూ.54,450, దిల్లీలో రూ.54,600, కలకత్తాలో రూ.54,450, బెంగళూరులో రూ.54,450, కేరళలో రూ.54,450, పూణేలో రూ.54,450, జైపూర్ లో రూ.54,600, కోయంబత్తూరులో రూ.54,820, సూరత్ లో రూ.54,500, నాశిక్ లో రూ.54,480, మైసూర్ లో రూ.54,450, గురుగ్రామ్ రూ.54,600 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధరలు వివిధ ప్రాంతాల్లో గమనిస్తే.. చెన్నైలో రూ.59,800, ముంబైలో రూ.59,410, దిల్లీలో రూ.59,560, కలకత్తాలో రూ.59,410, బెంగళూరులో రూ.59,410, కేరళలో రూ.59,410, పూణేలో రూ.59,410, జైపూర్ లో రూ.59,560, కోయంబత్తూరులో రూ.59,800, సూరత్ లో రూ.59,460, నాశిక్ లో రూ.59,440, మైసూర్ లో రూ.59,410, గురుగ్రామ్ రూ.59,560 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా ధరలను పరిశిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, కాకినాడల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,450గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,410 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని నగరాల్లో సైతం ఇదే ధరలు కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications