Gold Price Today: కొద్ది రోజుల్లో ప్రేమికులకు ఎంతో ఇష్టమైన వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ఈ క్రమంలో రేపటి నుంచి వాలెంటైన్స్ వీక్ ప్రారంభం అవుతోంది. దీంతో చాలా మంది తగ్గిన పసిడి ధరల సమయంలో తమ ప్రియమైన వారికి గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తగ్గిన ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.200 మేర తగ్గింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను నేడు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,300, ముంబైలో రూ.57,750, దిల్లీలో రూ.57,900, కలకత్తాలో రూ.57,750, బెంగళూరులో రూ.57,750, కేరళలో రూ.57,750, వడోదరలో రూ.57,800, జైపూరులో రూ.57,900, మంగళూరులో రూ.57,750, నాశిక్ లో రూ.57,780, అయోధ్యలో రూ.57,900, బళ్లారిలో రూ.57,750, గురుగ్రాములో రూ.57,900 వద్ద ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.220 క్షీణించాయి. దీంతో వివిధ నగరాల్లో నేటి రిటైల్ తగ్గింపు ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.63,600, ముంబైలో రూ.63,000, దిల్లీలో రూ.63,150, కలకత్తాలో రూ.63,000, బెంగళూరులో రూ.63,000, కేరళలో రూ.63,000, వడోదరలో రూ.63,050, జైపూరులో రూ.63,150, మంగళూరులో రూ.63,000, నాశిక్ లో రూ.63,030, అయోధ్యలో రూ.63,150, బళ్లారిలో రూ.63,000, గురుగ్రాములో రూ.63,150 వద్ద కొనసాగుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విశాఖ, అనంతపురం, కడప, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, నిజాంబాద్, కరీంనగర్ లలో 22 క్యారెట్ల రేటు రూ.57,750గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,000గా ఉంది. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.700 తగ్గి రూ.76,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications