IT News: టెక్కీలకు మంచి రోజులు.. స్వర్ణయుగం సద్వినియోగానికి సిద్ధంకండి..!!
Tech Jobs: జాబ్ మార్కెట్ నిపుణుల తాజా విశ్లేషణ ప్రకారం టెక్ రంగానికి తిరిగి మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయని తెలుస్తోంది. కరోనా సమయంలో మాదిరిగా భారీ రిక్రూట్మెంట్లు త్వరలోనే ప్రారంభం అవుతాయని తాము ఆశాభావంతో ఉన్నామని వారు చెబుతున్నారు.
ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ ఐటి కంపెనీలు దాదాపు 2 ఏళ్లుగా వ్యాపారంలో మందగమనాన్ని చూస్తున్నాయి. దీంతో పెద్ద డీల్స్, ప్రాజెక్టుల సంఖ్య తగ్గటం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. మార్జిన్లపై ప్రభావం అధికంగా ఉండటంతో ఐటీ సేవల కంపెనీలు తక్కువ వేతన పెంపులు, హైక్స్ వాయిదాలు, ప్రమోషన్ల వాయిదాలు, వేరియబుల్ పేలో కోతలు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే కష్టకాలం ఇక ముగింపుకు వచ్చిందని టెక్ పరిశ్రమలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతవారం యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గింపును ప్రకటించటంతో డీల్స్ సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది.

ఈ పరిస్థితులతో ఐటీ ఉద్యోగులకు స్వర్ణయుగం మళ్లీ మెుదలవుతోంది. దీని వల్ల జీతాల పెంపు నుంచి ఉపాధి అవకాశాల పెరుగుదల వరకు ఐటీ సేవలకు మొత్తం డిమాండ్ పెరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. జూలై-ఆగస్టు త్రైమాసిక కాలంలో భారతీయ టెక్ కంపెనీలు దాదాపు 33 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. టాటాలకు చెందిన టీసీఎస్ మాత్రమే ప్రైమార్క్ ఐర్లాండ్, రోల్స్ రాయిస్, సిడ్నీ మారథాన్, మెక్‌డొనాల్డ్స్ ఫిలిప్పీన్స్‌తో నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ జూలైలో అత్యధికంగా 3 ఒప్పందాలను కుదుర్చుకుంది.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్‌తో పాటు, కాగ్నిజెంట్ ఇప్పటివరకు సెక్టార్ అలారం, డెలావేర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్, TDC నెట్, సర్వీస్‌నౌ, మెట్రో బ్యాంక్, ఫిన్‌లాండ్ పోస్టల్ సేవల దిగ్గజం పోస్టి గ్రూప్‌లతో ఒప్పందాలు కుదిరాయి. మూడో స్థానంలో ఉన్న హెచ్‌సిఎల్ టెక్ జిరాక్స్‌తో భారీ డీల్‌ను, జర్మనీకి చెందిన అపోబ్యాంక్‌తో మరో డీల్‌ను ప్రకటించింది. ఇక విప్రో విషయానికి వస్తే.. జర్మనీకి చెందిన మాహ్లే అండ్ జాన్ లూయిస్ భాగస్వామ్యంతో కనీసం మూడు ఒప్పందాలను ప్రకటించింది. ఇక టాప్-5 కంపెనీల్లో ఒకటిగా ఉన్న టెక్ మహీంద్రా దోహాకు చెందిన ఊరెడూ, మార్షల్ గ్రూప్‌తో రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. అలాగే ఏడాది చివరి నాటికి దాదాపు 700 టెక్ సర్వీస్ కాంట్రాక్టులు రెన్యూవల్ చేయబడనున్నాయి. వీటి విలువ దాదాపు 26 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా వేయబడింది.


Click it and Unblock the Notifications