Gold Rate: కొత్త నెల పసిడి ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన బంగారం రేటు..!!
Gold Rate: పసిడి ప్రియులు చాలా కాలంగా కోరుకుంటున్న ధరల తగ్గుదల మెుదలైంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా తెలుస్తోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు స్వల్పంగా రూ.100 తగ్గింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం విక్రయ రిటైల్ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,350, ముంబైలో రూ.54,050, దిల్లీలో రూ.54,200, కలకత్తాలో రూ.54,050, బెంగళూరులో రూ.54,050, పూణేలో రూ.54,050, వడోదరలో రూ.54,100, జైపూర్ లో రూ.54,200, లక్నోలో రూ.54,200, మధరైలో రూ.54,350, పాట్నాలో రూ.54,100, సూరత్ లో రూ.54,100, మంగళూరులో రూ.54,050, నాశిక్ లో రూ.54,080గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర రూ.110 మేర తగ్గింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.59,290, ముంబైలో రూ.58,960, దిల్లీలో రూ.59,120, కలకత్తాలో రూ.58,960, బెంగళూరులో రూ.58,960, పూణేలో రూ.58,960, వడోదరలో రూ.59,020, జైపూర్ లో రూ.59,120, లక్నోలో రూ.59,120, మధరైలో రూ.59,290, పాట్నాలో రూ.59,020, సూరత్ లో రూ.59,020, మంగళూరులో రూ.58,960, నాశిక్ లో రూ.58,990 వద్ద కొనసాగుతున్నాయి.

బంగారం రేట్లు తగ్గిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో రేట్లను గమనిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, అనంతపురంలలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.54,050గా ఉండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.58,960గా కొనసాగుతున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో కూడా ఇదే రేట్లకు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి రేట్లు మాత్రం ధరలో ఎలాంటి మార్పు లేకుండా దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications