Gold Price Today: గత కొన్ని రోజులుగా బంగారం ధర కళ తప్పింది. దీంతో సామాన్యులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటూ షాపింగ్ మెుదలెట్టారు. ధరల పతనంతో రానున్న పండుగల సీజన్ కోసం ఆభరణాల వేటలో పడ్డారు.
22 క్యారెట్ల బంగారం ధరలు నేడు సైతం తగ్గాయి. దీంతో 10 గ్రాముల రిటైల్ విక్రయ ధరలు నిన్నటి కంటే రూ.100 మేర పడిపోయింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీస్తే.. చెన్నైలో రూ.54,950, ముంబైలో రూ.54,450, దిల్లీలో రూ.54,600, కలకత్తాలో రూ.54,450, బెంగళూరులో రూ.54,450, కేరళలో రూ.54,450, పూణేలో రూ.54,450, జైపూర్ లో రూ.54,600, కోయంబత్తూరులో రూ.54,950, నాశిక్ లో రూ.54,480గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల బంగారం ధరలు నిన్నటి కంటే రూ.110 తగ్గాయి. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర వివిధ నగరాల్లో రిటైల్ గా పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,950, ముంబైలో రూ.59,400, దిల్లీలో రూ.59,550, కలకత్తాలో రూ.59,400, బెంగళూరులో రూ.59,400, కేరళలో రూ.59,400, పూణేలో రూ.59,400, జైపూర్ లో రూ.59,550, కోయంబత్తూరులో రూ.59,950, నాశిక్ లో రూ.59,430గా కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, కాకినాడ, విశాఖ, నెల్లూరు, తిరుపతి, అనంతపురంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,450గా ఉండగా.. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.59,400గా విక్రయించబడుతోంది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజాంబాద్ లలో సైతం ఇవే ధరలు కొసాగుతున్నాయి. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతూ తెలుగు రాష్ట్రాల్లో కేజీ రూ.76,200గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications