Gold Price Today: రూ.1,579 తక్కువకు బంగారం లభ్యం.. పూర్తి వివరాలు..
Gold Price Today: గతవారం బంగారం మార్కెట్లో పెద్దగా డిమాండ్ చూడలేకపోయింది. అయితే ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం భారీగా క్షీణించాయి. ఐదు ట్రేడింగ్ సెషన్లలో 10 గ్రాముల గోల్డ్ ధర కేవలం రూ.273 మాత్రమే తగ్గింది.
నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి కంటే రూ.200 మేర పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,550, ముంబైలో రూ.55,150, దిల్లీలో రూ.55,300, కలకత్తాలో రూ.55,150, బెంగళూరులో రూ.55,150, కేరళలో రూ.55,150, పూణేలో రూ.55,150, వడోదరలో రూ.55,200, జైపూర్ లో రూ.55,300, మధురైలో రూ.55,550, సూరత్ లో రూ.55,200, నాశిక్ లో రూ.55,180 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు నిన్నటి కంటే రూ.210 మేర పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,600, ముంబైలో రూ.60,160, దిల్లీలో రూ.60,310, కలకత్తాలో రూ.60,160, బెంగళూరులో రూ.60,160, కేరళలో రూ.60,160, పూణేలో రూ.60,160, వడోదరలో రూ.60,210, జైపూర్ లో రూ.60,310, మధురైలో రూ.60,600, సూరత్ లో రూ.60,210, నాశిక్ లో రూ.60,190 వద్ద ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, కాకినాడ, అనంతపురంలలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.60,160 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని నగరాల్లో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా కిలో రూ.78,500 వద్ద కొనసాగుతున్నాయి. అయితే మే 5న బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం స్పాట్ ధర రూ.61,739కి తాకి గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్లో ధర దీని కంటే రూ.1,579 తక్కువ వద్ద ఉంది. అందువల్ల పసిడి కొనాలనుకునే వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications