RBI News: 'గుడ్ రిటర్న్స్' పోల్‌కు భారీ స్పందన.. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపుపై ఆర్థికవేత్తల అంచనాలివే..
Interest Rates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు ఇటీవలే బడ్జెట్ సమర్పించారు. కాగా ఇప్పుడు అందరి చూపు రిజర్వ్ బ్యాంక్ ప్రకటనపై పడింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి వడ్డీ రేట్లపై కీలక అనౌన్స్‌మెంట్ వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలు మీడియా సంస్థలు పోల్స్ నిర్వహించాయి.
జూలై 25 నుంచి ఆగస్టు 4 మధ్య గుడ్ రిటర్న్స్ RBI పాలసీ పోల్ నిర్వహించింది. భారీ స్థాయిలో ప్రతిస్పందనలు పొందిన ఈ పోల్‌లో 52 మంది ఆర్థిక నిపుణులు కీలక అభిప్రాయాలు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ ఏడాది అక్టోబర్ లేదా డిసెంబర్‌లో రెపో రేటును తగ్గించే అవకాశం ఉందని ఇందులో పాల్గొన్న విశ్లేషకులు తెలిపారు.

ఆర్థికవ్యవస్థ పరంగా భారత్ దేదీప్యమానంగా వెలిగిపోతన్నప్పటికీ, భారీగా పెరుగుతున్న ఆహార ధరల కారణంగా ద్రవ్యోల్బణ ప్రమాదం పొంచి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఆగస్టులో జరగాల్సిన పాలసీ సమావేశంలో RBI వరుసగా తొమ్మిదోసారి వడ్డీరేట్లను 6.50 శాతం వద్ద ఉంచుతుందని 52 మంది ఆర్థికవేత్తలు ఏకగ్రీవంగా అంచనా వేశారు.
'CPI ద్రవ్యోల్బణం 5.08 శాతం వద్ద అధికంగా ఉన్నందున RBI ఈసారి రేట్లను తగ్గించకపోవచ్చు' అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ VK విజయకుమార్ తెలిపారు. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ స్పందిస్తూ 'రాబోయే క్రెడిట్ పాలసీలో RBI యథాతథ స్థితిని అవలంభిస్తుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే నేటికీ ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంది. రాబోయే నెలల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది' అని వెల్లడించారు.
వడ్డీరేట్ల విషయంలో ఈ ఏడాది చివరి వరకు RBI వేచి చూస్తుందా అన్న ప్రశ్నకు ఇద్దరు నిపుణులు డిసెంబర్ వరకు ప్రస్తుత తటస్థత స్థితి చెక్కుచెదరబోదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఆధారంగా సెంట్రల్ బ్యాంక్ తన వైఖరిని సడలించే సౌలభ్యం ఉన్నట్లు మరో విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు. ఇక ICRA రీసెర్చ్ అండ్ ఔట్రీచ్ హెడ్, చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ కూడా యధాతథస్థికి కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.


Click it and Unblock the Notifications