Chandrayan3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-౩ ని జాబిల్లిపై ఇవాళ సాఫ్ట్ ల్యాండింగ్ చేయనుంది. కాగా ప్రపంచం యావత్తు దృష్టి ప్రస్తుతం ఈ ప్రయోగంపైనే ఉంది. అయితే మార్కెట్ ప్లేయర్స్ చూపు మాత్రం చంద్రయాన్-3 లాంచింగ్ కు వెన్నుదన్నుగా నిలిచిన కంపెనీలపై పడింది. ఈ ప్రయోగంపై సానుకూల ఫలితం అంచనాలతో ఆయా స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి.
చంద్రయాన్-3 పట్టాలెక్కడానికి దేశంలోని ప్రభుత్వ సంస్థలతో పాటు పలు ప్రైవేటు కంపెనీలు సహకారం అందించాయి. L&T, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్(MDNL), భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BHEL), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సహా వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్ మరియు MTAR టెక్నాలజీస్ ఇందులో పాలు పంచుకున్నాయి.

ఇవాళ సాయంత్రం ల్యాండింగ్ కోసం చంద్రయాన్-3 సిద్ధం కాగా.. బూస్టర్ విభాగాలు సహా పలు పలు పరికరాలు అందించిన L&T షేర్ విలువ మధ్యాహ్నం 2.30 సమయానికి 1.50 శాతానికి పైగా పెరిగింది. కోబాల్ట్, నికెల్, టైటానియం సహా పలు లోహ మిశ్రమాలను లాంచ్ వెహికల్ కోసం సరపరా చేసిన MDNL.. 4.5 శాతానికి మించి లాభపడింది.
PSLV రాకెట్స్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ షేర్ విలువ 3.5 శాతానికి పైగా పెరిగింది. కీలక బూస్టర్ విభాగాలు, ఇతర సబ్ సిస్టమ్స్ రూపొందించడంలో వాల్ చంద్ నగర్ ఇండస్ట్రీస్ సహకారం అందించింది. ఇది 1.3 శాతం పైగా ఇవాళ సెషన్ లో లాభపడింది. చంద్రయాన్-3 ప్రయోగం కోసం పలు ఇతర భాగాలు తయారుచేసిన MTAR టెక్నాలజీస్ కూడా 5 శాతానికి పైగా పెరిగింది.
అయితే ఈ ప్రయోగం కోసం బ్యాటరీలు అందించడంలో కీలకపాత్ర పోషించిన BHEL.. క్రయోజనిక్ ఫేజ్ కోసం బైమెటాలిక్ అడాప్టర్స్ ను సైతం అందించింది. కొన్ని బాహ్య కారణాలవల్ల BHEL షేర్ ప్రైస్ ఇవాళ దాదాపు 0.7 శాతం క్షీణించింది. ఈరోజు సాయంత్రం చంద్రయాన్-3 ల్యాండింగ్ ఫలితం ఆధారంగా రేపు కూడా మార్కెట్లో ఆయా షేర్లలో భారీ ర్యాలీ ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications