Gold Price Today: పసిడి ప్రియులు గతవారం నుంచి నిరంతరాయంగా పెరుగుతు గోల్డ్ రేట్లతో షాక్ కి గురవుతున్నారు. ఈ క్రమంలో షాపింగ్ చేయాలా లేదా అని వెనుకాడుతున్న వేళ రేట్లు తగ్గటం హీట్ తగ్గిస్తోంది. రేపు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు రేట్లను తగ్గించవచ్చని ప్రకటనలు వస్తున్న వేళ తర్వాతి పరిణామాలపై అందరి దృష్టి కొనసాగుతోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.1500 తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన నేటి రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6865, ముంబైలో రూ.6865, దిల్లీలో రూ.6880, కలకత్తాలో రూ.6865, బెంగళూరులో రూ.6865, కేరళలో రూ.6865, వడోదరలో రూ.6870, జైపూరులో రూ.6880, లక్నోలో రూ.6880, మంగళూరులో రూ.6865, నాశిక్ లో రూ.6868, అయోధ్యలో రూ.6880, బళ్లారిలో రూ.6865, గురుగ్రాములో రూ.6880, నోయిడాలో రూ.6880 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.1400 తగ్గింపుతో కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన నేటి రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7489, ముంబైలో రూ.7489, దిల్లీలో రూ.7504, కలకత్తాలో రూ.7489, బెంగళూరులో రూ.7489, కేరళలో రూ.7489, వడోదరలో రూ.7494, జైపూరులో రూ.7504, లక్నోలో రూ.7504, మంగళూరులో రూ.7489, నాశిక్ లో రూ.7492, అయోధ్యలో రూ.7504, బళ్లారిలో రూ.7489, గురుగ్రాములో రూ.7504, నోయిడాలో రూ.7504గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6865గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7489 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 తగ్గి రూ.97,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
గోల్డ్ రేట్లు పతనం ఎందుకు? భవిష్యత్తులో పరిస్థితి ఏంటి..?
ప్రస్తుతం దేశంలోని పసిడి ప్రియుల మదిలో ఉన్న ఏకైక ప్రశ్న గోల్డ్ రేట్లు ఎప్పుడు స్థిరపడతాయనేదే. వాస్తవానికి దసరా నుంచి దీపావళి వరకు శుభకార్యాలకు షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు రేట్ల అస్థిరత, భారీ ర్యాలీపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాల మధ్య గోల్డ్ రేట్లు పతనమవడానికి కొన్ని కారణాలను పరిశీలిస్తే..
1. గ్లోబల్ ఆర్థిక సంకేతాలు: ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలని సూచిస్తున్నా కూడా, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంకేతాలు సానుకూలంగా ఉంటే, పెట్టుబడులు మరో అవకాశం కోసం తిరిగి చూస్తాయి. అంటే ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి ఆశిస్తున్నప్పుడు గోల్డ్‌పై డిమాండ్ తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
2. ఆర్థిక సూచకాలు: ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే ప్రకటనలు చూస్తుంటే.. అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మెరుగైనట్టుగా కనిపిస్తున్నాయి. ఇది మార్కెట్‌లోకి నమ్మకాన్ని పెంచవచ్చు, కాబట్టి పెట్టుబడులు మరింత అధిక లాభాలు అందించే మార్గాల్లో తమ డబ్బును ఇన్వెస్ట్ చేసేందుకు సేఫ్ హెవెన్ గోల్డ్‌ను విడిచిపెడతారు.
3. ఫెడ్ ప్రకటన ప్రభావం: ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుని ఇప్పటికే అంచనా వేసిన మార్కెట్, తాజా నిర్ణయాల ప్రకారం కాస్త నిరుత్సాహం చూపించవచ్చు. ఇది గోల్డ్ రేట్లను పతనం చేస్తుందని తెలుస్తోంది. అలాగే సానుకూల ఆర్థిక నివేదికల మధ్య పెట్టుబడులు గోల్డ్ మాదిరి ప్యాసివ్ ఆస్తులపై కంటే రెట్టింపు లాభాలు అందించే ఆప్షన్స్ వైపునకు తరలవచ్చు.
గోల్డ్ రేట్లు పక్కా తగ్గుతాయా..?
కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు ఈ సమయంలో అడుగుతున్న గోల్డ్ రేట్ల పతనం కొనసాగుతుందా అనే ప్రశ్నకు స్పష్టమైన జవాబును అందించడం కష్టమే. ఎందుకంటే ఇది అనేక కారకాలపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి జాతీయ లేదా అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక సంఘటనలు వంటివి ఎల్లప్పుడూ ప్రభావితం చేస్తుంటాయి. అలాగే జ్యూవెలరీ, ఉత్పత్తుల డిమాండ్ పెరగడం లేదా తగ్గడం కూడా గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తుంటుంది.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications