Vodafone Idea Shares: దేశీయ స్టాక్ మార్కెట్లలో పెన్నీ, తక్కువ ధర ఉన్న కంపెనీ షేర్లకు ఎల్లప్పుడూ డిమాండ్ భారీగా ఉంటుంది. కొందరు పెద్ద బ్లూచిప్ కంపెనీ షేర్ల కంటే ఎక్కువ ప్రాధాన్యతను తక్కువ రేటు ఉన్న స్టాక్స్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలో వోడాఫోన్ ఐడియా కంపెనీ ఇన్వెస్టర్లకు మంచి వార్త ఒకటి ఉంది.
తాజాగా యూకే ఆధారిత వోడాఫోన్ గ్రూప్ గతంలో వోడాఫోన్ ఐడియా కంపెనీ షేర్లను తాకట్టుపెట్టి తెచ్చిన రుణాన్ని తిరిగి చెల్లించింది. ఈ క్రమంలో కంపెనీ దాదాపు రూ.11,650 కోట్లను తిరిగి చెల్లించినట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. ఈ క్రమంలో కంపెనీ తనకు వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ కంపెనీలో ఉన్న మెుత్తం వాటాలను తాకట్టుపెట్టి 109 మిలియన్ పౌండ్లను రుణాన్ని పొందిన సంగతి తెలిసిందే. వోడాఫోన్ గ్రూప్‌కు చెందిన మారిషస్, భారత్ ఆధారిత సంస్థలు పెంచిన రుణాల కోసం HSBC కార్పొరేట్ ట్రస్టీ కంపెనీకి అనుకూలంగా తాకట్టుపెట్టింది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వోడఫోన్ గ్రూప్‌కు భారతీయ వోడఫోన్ ఐడియా కంపెనీలో 22.56 శాతం వాటా ఉంది. అలాగే సెప్టెంబర్ 30, 2024 నాటికి కంపెనీలో అదానీ బిర్లా గ్రూప్ కు 14.76 శాతం, భారత ప్రభుత్వానికి కంపెనీలో 23.15 శాతం వాటాలు ఉన్నాయి. మిగిలిన వాటా సాధారణ ఇన్వెస్టర్లతో పాటు ఇతరుల వద్ద ఉంది. శుక్రవారం మార్కెట్ల ముగింపు సమయంలో వోడఫోన్ ఐడియా స్టాక్ ధర మార్కెట్ ముగింపు సమయంలో రూ.7.49 వద్ద స్థిరపడింది. తాజా పరిణామాలతో కంపెనీ షేర్లకు సోమవారం మార్కెట్లో సానుకూల ధోరణిని కలిగి ఉంటుందని నిపుణులు అంచనా వేశారు.
కేంద్రం నుంచి టెలికాం కంపెనీకి శుభవార్త..
టెలికాం ఆపరేటర్లు తమ స్పెక్ట్రమ్ కొనుగోళ్లకు బ్యాంక్ గ్యారెంటీలు ఇవ్వాల్సిన అవసరం లేదని టెలికాం డిపార్ట్మెంట్ ప్రకటన వోడఫోన్ ఐడియా కంపెనీకి కలిసొచ్చే పెద్ద అంశం. ఈ పరిణామాలు 4జీ, 5జీ పెట్టుబడులను దేశంలో మెరుగుపరుస్తుందని కంపెనీ పేర్కొంది. తాజా సంస్కరణకు ముందు ప్రతి స్పెక్ట్రమ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కు వ్యతిరేకంగా సుమారు రూ.24,800 కోట్లకు సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీలను వోడఫోన్ ఐడియా లిమిటెడ్ అందించాల్సిన అవసరం ఉంది. పైన పేర్కొన్న వేలం కారణంగా వాయిదా పడిపోవడానికి 13 నెలల ముందు కంపెనీ BSE ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ 2012, 2014, 2016, 2021 స్పెక్ట్రమ్ వేలంలకు బ్యాంక్ గ్యారెంటీలు అందించాల్సిన అవసరం లేదని కంపెనీ వెల్లడించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications