Vijayawada: బెజవాడలో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులకు శుభవార్త..!!
Passport News: వాస్తవానికి భారత ప్రభుత్వం తన పౌరులు ఇతర దేశాలకు ప్రయాణం చేసేందుకు వెసులుబాటు కల్పిస్తూ జారీ చేసే ముఖ్యమైన పత్రం పాస్‌పోర్ట్. ఇది దీనికి తోడు వినియోగదారులకు అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అలాగే చాలా చోట్ల దీనిని అధికారిక గుర్తింపు పత్రంగా కూడా పరిగణించబడుతోంది.
విదేశాలకు వెళ్లటానికి మాత్రమే కాకుండా అక్కడ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కాన్సులర్ నుంచి సహాయం పొందటానికి కూడా ఇది సహాయపడుతుంది. దేశ భద్రతకు సైతం పాస్‌పోర్ట్ కీలకమైనది. అక్రమంగా ఇతర దేశాలకు చెందిన ప్రజలు ప్రవేశించకుండా నియంత్రించటానికి కూడా ఇది దోహదపడుతుంది. అందుకే భారత దేశంలో వీటిని ప్రధానంగా మూడు కేటగిరీల కింద అందిస్తున్నారు. ఒకటి సాధారణ పాస్‌పోర్ట్, రెండవది అధికారిక పాస్‌పోర్ట్, చివరిది దౌత్య పాస్‌పోర్ట్. వీటిని అప్లై చేస్తున్న సదరు వ్యక్తిని బట్టి మారుస్తుంటారు.

ఉదాహరణకు తెల్లటి పాస్‌పోర్ట్ ప్రభుత్వ అధికారులకు అందించబడుతుంది. ప్రభుత్వ అధికారిక పనులపై వారు ఇతర దేశాలకు వెళ్లినప్పుడు దీనిని వినియోగిస్తారు. దీని రంగును బట్టి ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా వ్యవహరించటం సులభంగా ఉంటుంది. ఇప్పటికే భారతదేశంలో ప్రభుత్వం ఈ-పాస్‌పోర్టును కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. పొడవైన క్యూలైన్లలో సమయం వృధా కాకుండా అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఇది దోహదపడుతుంది.
బెజవాడవాసులకు శుభవార్త..
విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి వినియోగదారులకు ఇప్పుడొక శుభవార్త ఉంది. ఇకపై విజయవాడ కార్యాలయంలో రోజుకు అదనంగా 50 స్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటిని ఫిబ్రవరిలో ప్రతి బుధవారం 250 అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. దరఖాస్తుదారులు తాజా అపాయింట్మెంట్లు, దరఖాస్తుల కోసం www.passportindia.gov.inను సంప్రదించటం ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించింది.
- భారత పౌరులు ఎవ్వరికైనా విదేశీ ప్రయాణాలు చేసేవారి కోసం కామన్‌గా ఇదే పాస్‌పోర్ట్ మనందరికీ తెలిసిన బ్లూ రంగులో ఉంటుంది. ఇది వ్యక్తులు విదేశీలకు వెళ్లటం కోసం అందించబడుతోంది. చదువు, వ్యాపారం, విదేశీ ప్రయాణాల కోసం వెళ్లే వారికి సహజంగా దీనిని అందిస్తుంటారు.
- ఇక రెండవది తత్కాలి పాస్‌పోర్ట్. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిన వ్యక్తులకు దీనిని అందిస్తుంటారు. కేవలం అనుమతించిన పనిని పూర్తి చేసుకుని తిరిగి వచ్చేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంటుంది.
- ఇక చివరిగా మెరూన్ రంగులో ఉండే పాస్‌పోర్ట్ గురించి తెలుసుకుందాం. ఇది డిప్లొమేట్లకు అందిస్తుంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి, రాష్ట ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, విదేశీ వ్యవహారాల ముఖ్య అధికారులకు మాత్రమే వీటిని అందిస్తుంటారు.


Click it and Unblock the Notifications