గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (accenture) ఉద్యోగులకు చల్లటి వార్త తెలిపింది. లెవెల్ 8 (అసోసియేట్ మేనేజర్) అలాగే అంతకంటే పై స్థాయి ఉద్యోగులకు 3% నుండి 13% వరకు జీతాల పెంపును కంపెనీ తాజగా ప్రకటించింది. అయితే గత రెండన్నరేళ్లలో మొదటిసారి జీతాల పెంపు చేయడంతో ఉద్యోగుల్లో కొంత ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా చాలా కాలం తర్వాత వేతనాల పెంపు ప్రకటన రావడంతో ఉద్యోగుల నుండి మిశ్రమ స్పందన కూడా వ్యక్తమవుతోంది.

డిమాండ్ వాతావరణం, ప్రమోషన్లు: యాక్సెంచర్ మార్చి 20న Q2FY25 ఫలితాలను ప్రకటించేటప్పుడు కంపెనీ వార్షిక ఆదాయ అంచనాను పెంచింది. క్లయింట్ల కార్యకలాపాలలో AI-ఆధారిత సాధనాలను అనుసంధానించడానికి పెరుగుతున్న డిమాండ్ దీనికి కారణమని పేర్కొంది.
యాక్సెంచర్ సీనియర్ కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్ షేర్ చేసిన ఇంటర్నల్ మెయిల్ ప్రకారం, ఈ పెంపు కంపెనీ జూన్ పర్ఫార్మెన్స్ సైకిల్లో భాగం. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్స్'తో పాటు వస్తుంది, వీరిలో భారతదేశం నుండి దాదాపు 15 వేల మంది ఉన్నారు. 2025 ఆర్థిక సంవత్సరానికి భారతదేశంలో 43 వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రమోషన్స్ లభించే అవకాశం ఉంది. FY25 చివరి నాటికి భారతదేశంలోని యాక్సెంచర్ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ మంది ప్రమోషన్లు లేదా స్టే-ఎట్-లెవల్ సర్దుబాటుల ద్వారా వేతన పెంపు (base-pay)ను పొందుతారని ఆయన అన్నారు.
ఐటీ రంగంలో కొత్త ఆశలు: డబ్లిన్ ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ సంస్థలో దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గత నెలలో భారతీయ ఐటీ కంపెనీలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇంకా విప్రో వేతన పెంపును ఆలస్యం చేశాయి. అంతేకాకూండా ఈ సంవత్సరం వేతన పెంపును వాయిదా వేస్తున్నట్లు TCS చెప్పగా, వ్యాపార వాతావరణాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని విప్రో తెలిపింది. ఈ నేపథ్యంలో యాక్సెంచర్ పెంపు ప్రకటన ఐటీ రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
అస్థిరమైన ప్రపంచ వ్యాపార వాతావరణంలో కంపెనీ కొట్టుమిట్టాడినప్పటికీ FY24 నాటికి యాక్సెంచర్ ఆదాయ వృద్ధిలో పుంజుకుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో బలమైన వృద్ధిని సాధించడానికి కూడా కంపెనీ సిద్ధమవుతోంది. జూన్ నెల ప్రమోషన్లను మే 26 నుండి 29 మధ్య మేనేజర్లు ఉద్యోగులకు తెలియజేస్తారు, అలాగే ఈ వివరాలను మే 29న షేర్ చేస్తారు. బోనస్ ఇంకా వేరియబుల్ పే డిసెంబర్ సైకిల్‌ను అనుసరించి కొనసాగుతాయని విజ్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications