Suzlon Energy Shares: భారతదేశంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా పెన్నీ స్టాక్స్ కొంటుంటారు. అయితే వారి దృష్టి ప్రస్తుతం భవిష్యత్తు కలిగిన మల్టీబ్యాగర్ ఎనర్జీ స్టాక్స్ పైన కొనసాగుతోంది. ఈ క్రమంలో చాలా మంది ఇప్పటికే తమ పెట్టుబడి కిట్టీలో సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
సుజ్లాన్ ఎనర్జీ పెట్టుబడిదారులకు ప్రస్తుతం మార్కెట్లో పెద్ద శుభవార్త వచ్చింది. వరుసగా 6వ రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లలో సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. ఈ క్రమంలో నేడు ఎన్ఎస్ఈలో స్టాక్ ధర ఒక్కోటి రూ.55.11 వద్ద ప్రారంభమై.. ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.56.69 రేటుకు చేరుకుంది. దీంతో గడచిన 6 ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు 14 శాతం మేర లాభాన్ని నమోదు చేశాయి. నిపుణుల అంచనా ప్రకారం టెక్నికల్ గా కంపెనీ షేర్లు 52 రేటు వద్ద బలమైన మద్దతును కలిగి ఉన్నట్లు వెల్లడైంది. అలాగే 58-60 స్థాయి వద్ద నిరోధాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.

టెక్నికల్ నిరోధాన్ని అధిగమిస్తే రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.70 మార్కును చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే సపోర్ట్ జోన్ దిగువకు చేరుకుంటే స్టాక్ క్రాష్ కావొచ్చని వారు చెబుతున్నారు. బ్రోకరేజ్ సంస్థ ఇన్వెస్టెక్ రూ.70 స్టాక్ ధరతో స్టాక్‌పై కవరేజ్ ప్రారంభించిన తర్వాత సుజ్లాన్ షేర్లు ర్యాలీ చేయడం ప్రారంభించాయి. విండ్ ఎనర్జీ రంగంలో పునరుజ్జీవనం వల్ల సుజ్లాన్ ఎనర్జీ ప్రయోజనం పొందే అవకాశం ఉందని ఇన్వెస్టెక్ విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. కంపెనీ ఆర్డర్ బుక్ 5.5 GWకి చేరుకుంది మరియు దాని సరఫరా గొలుసు కూడా బాగా ఆప్టిమైజ్ చేయబడింది.
భారీ ఆర్డర్..
సుజ్లాన్ కంపెనీ షేర్లు లాభపడటానికి అసలు కారణం కంపెనీ మూడోసారి జిందాల్ గ్రీన్ విండ్ సంస్థ నుంచి 204.75 మెగావాట్లకు ఆర్డర్ పొందటమే. వాస్తవానికి ఈ సంస్థ జిందాల్ రెన్యూవబుల్స్ కి అనుబంధ సంస్థ కావటం గమనార్హం. ఈ భాగస్వామ్యం ఇప్పుడు సుజ్లాన్ అతిపెద్ద వాణిజ్య & పారిశ్రామిక ఆర్డర్. దీంతో మెుత్తం ఆర్డర్ 907.20 మెగావాట్లకు చేరుకుంది. ఇప్పటికే జిందాల్ కంపెనీ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో కలిగి ఉన్న జిందాల్ స్టీల్ ప్లాంట్లకు అవసరమైన విద్యుత్ తయారీ కోసం రెండు ఆర్డర్లను సుజ్లాన్ దక్కించుకుంది.
ప్రస్తుతం సుజ్లాన్ ఆర్డర్ బుక్ గమనిస్తే పెద్ద వాణిజ్య & పారిశ్రామిక కస్టమర్ల వాటా 59 శాతంగా ఉండటం గమనార్హం. ఇది కంపెనీ చరిత్రలో అత్యధికంగా కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం జిందాల్ కొత్త ఆర్డప్ పరిశీలిస్తే.. సుజ్లాన్ 65 అత్యాధునిక S144 విండ్ టర్బైన్ జనరేటర్‌లను హైబ్రిడ్ లాటిస్ టవర్స్ తో సరఫరా చేయనున్నట్లు వెల్లడైంది. ఇవి ఒక్కొక్కటి 3.15 MW విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయి. ఉత్పత్తి చేయబడిన శక్తిని ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని ఉక్కు కర్మాగారాల్లో క్యాప్టివ్ వినియోగం కోసం ఉపయోగిస్తారు. ఇది భారత ప్రభుత్వం నిర్థేశించుకున్న గ్రీన్ ఎనర్జీ పరివర్తనలో భాగంగా మారటానికి జిందాల్ కు దోహదపడనుంది.
కర్ణాటకలోని ప్రారంభ విజయాల ఆధారంగా కంపెనీ ప్రస్తుతం తక్కువ CO₂ స్టీల్ ఉద్యమాన్ని తమిళనాడుకు విస్తరిస్తున్నట్లు సుజ్లాన్ గ్రూప్ వైస్ చైర్మన్ గిరీష్ తంతి వెల్లడించారు. భారతదేశంలో స్థిరమైన పారిశ్రామిక వృద్ధి భవిష్యత్తు కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో కంపెనీ ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థల నుంచి కూడా ఆర్డర్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇది కంపెనీకి రానున్న త్రైమాసికాల్లో బలమైన లాభదాయకతకు దోహదపడుతుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications