Gold Price Today: బడ్జెట్ హడావిడి ముగియటంతో నిన్న తగ్గిన గోల్డ్ రేట్లు నేడు తిరిగి పుంజుకోవటం సామాన్యుల గుండెల్లో ఆందోళన సైరన్ మోగిస్తోంది. భవిష్యత్తులో బంగారం ఇక కొనటం కష్టమే అనే భావన ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తోంది. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రస్తుతం పెరిగిన రేట్లను పరిశీలించటం ముఖ్యం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.10,500 భారీ పెరుగుదలను నేడు నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7810, ముంబైలో రూ.7810, దిల్లీలో రూ.7825, కలకత్తాలో రూ.7810, బెంగళూరులో రూ.7810, కేరళలో రూ.7810, వడోదరలో రూ.7815, బళ్లారిలో రూ.7810, జైపూరులో రూ.7825, మంగళూరులో రూ.7810, నాశిక్‌లో రూ.7813, అయోధ్యలో రూ.7825, నోయిడాలో రూ.7825, గురుగ్రాములో రూ.7825 వద్ద నేడు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.11,500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8520, ముంబైలో రూ.8520, దిల్లీలో రూ.8535, కలకత్తాలో రూ.8520, బెంగళూరులో రూ.8520, కేరళలో రూ.8520, వడోదరలో రూ.8525, బళ్లారిలో రూ.8520, జైపూరులో రూ.8535, మంగళూరులో రూ.8520, నాశిక్‌లో రూ.8523, అయోధ్యలో రూ.8535, నోయిడాలో రూ.8535, గురుగ్రాములో రూ.8535గా ఉన్నాయి. అయితే ఈ ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి, వ్యాపారి లాభాలు వంటివి కలపకముందువిగా గుర్తుంచుకోవాలి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7810గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8520 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7810గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8520 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 తగ్గి రూ.1,06,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
వణికిస్తున్న బంగారం ధరలు ఇంకెన్నాళ్లు..!
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications