Sahara Refund News: సహారా ఇన్వెస్టర్లకు శుభవార్త.. రీఫండ్ క్లెయిమ్ పరిమితి పెంపు వివరాలివే
Sahara Group: దేశంలో కోట్ల మంది ఇన్వెస్టర్లు తమ డబ్బును సహారా గ్రూప్‌లో పెట్టుబడి పెట్టిన సంగతి తెలిసిందే. అనేక సంవత్సరాలుగా వీరిలో తమ డబ్బు ఎప్పుడు వస్తుందా అనే నిస్థేజం కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం వారికి ఊరటను అందించే వార్త ఒకటి వచ్చింది.
ప్రస్తుతం సహారా ఇన్వెస్టర్లు రీఫండ్ పోర్టల్ ద్వారా రూ.5,00,000 వరకు క్లెయిమ్ చేయవచ్చు. పోర్టల్ అందించిన సమాచారం ప్రకారం పెట్టుబడిదారులు రూ.5,00,000 వరకు క్లెయిమ్ కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ క్లెయిమ్స్ 45 పనిదినాల్లో ప్రాసెస్ చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర హోం మంత్రి అమిష్ షా జూలై 16 వరకు సహారా గ్రూప్‌లోని 4.2 లక్షల మందికి పైగా పెట్టుబడిదారులకు రూ.362.91 కోట్లు తిరిగి చెల్లించినట్లు పార్లమెంటులో వెల్లడించారు.

ఈ మెుత్తాలను సీఆర్‌సీఎస్-సహారా రీఫండ్ పోర్టల్ ద్వారా తిరిగి వచ్చినట్లు అమిత్ షా రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వాస్తవానికి మార్చి 29, 2023లో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ పోర్టల్ ఏర్పాటు చేయబడింది. సహారాలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు చట్టబద్ధంగా డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వటం దీని ఉద్దేశ్యంగా ఉంది. సహారా గ్రూప్‌కు చెందిన 4,20,417 మంది సహకార సంఘాల పెట్టుబడిదారులకు జూలై 16, 2024 వరకు రూ.362.91 కోట్ల మేర చెల్లింపులు జరిగాయి.
సహారా గ్రూప్‌లో మొత్తం 9.88 కోట్ల ఇన్వెస్టర్లకు చెందిన దాదాపు రూ.86,673 కోట్లు చిక్కుకుపోయాయి. సహారా గ్రూప్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ నిజమైన సభ్యులు/డిపాజిటర్ల చెల్లుబాటు అయ్యే డిపాజిట్ల చెల్లింపు, ఫిర్యాదుల పరిష్కారం కోసం సుప్రీం కోర్టులో సహకార మంత్రిత్వ శాఖ ఒక దరఖాస్తును దాఖలు చేసింది. దానిపై సుప్రీం కోర్ట్ రూ.5,000 కోట్లు మంజూరు చేసింది. డిపాజిటర్లు నాలుగు సొసైటీలకు సంబంధించిన అన్ని క్లెయిమ్‌లను ఒకే క్లెయిమ్ దరఖాస్తు ఫారమ్ ద్వారా చేయాలని పోర్టల్ పేర్కొంది. వీటికి సంబంధించిన వివరాలు లేదా సాంకేతిక సమస్యలపై సంప్రదించటానికి సొసైటీ టోల్ ఫ్రీ నంబర్లు (0522 6937100/0522 3108400/0522 6931000/08069208210)పై సంప్రదించవచ్చు.


Click it and Unblock the Notifications