Postal Insurance: దేశంలోని ప్రజలకు పోస్టాఫీసులు వివిధ పెట్టుబడి పథకాలతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా అందిస్తున్నాయి. దీని ప్రకారం పోస్టాఫీసుల్లో జీవిత బీమా పథకాలు తీసుకున్న పాలసీదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టాఫీసులు 6 రకాల జీవిత బీమా పథకాలను అందిస్తున్నాయి. సురక్ష అనే హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్, సువిత అనే కన్వర్టిబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్యారెంటీ, సంతోష్ అనే ఎండోమెంట్ ప్లాన్, యుగల్ సురక్ష అనే జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్, సుమంగళ్ అనే యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ ప్లాన్, పాల్ జీవన్ బీమా అనే చిల్డ్రన్ ప్లాన్ ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

ఈ 6 పథకాలకు కేంద్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి బోనస్ అమలులోకి వచ్చింది. దీనికి ముందు మార్చి 13న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పోస్టాఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ నిబంధనల ఆధారంగా బోనస్ ప్రకటించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఇకపై ప్రతి రూ.1000 లైఫ్ ఇన్సూరెన్స్ కి రూ.60 బోనస్ రూపంలో పెట్టుబడిదారులు పొందనున్నారు. అలాగే పిల్లల కోసం పాలసీలతో సహా ఎండోమెంట్ పథకాల్లో ప్రతి రూ.1,000 హామీకి రూ.48 బోనస్ అందించబడుతుందని సమాచారం.
అలాగే యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ప్రతి రూ.1,000కి రూ.45 బోనస్‌ను పొందుతాయి. కన్వర్టిబుల్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లకు ఎండోమెంట్ ప్లాన్‌లకు అందించిన బోనస్ రేటు వర్తిస్తుంది. ఇక టెర్మినల్ బోనస్ ప్రవేశపెట్టబడింది. దీని ప్రకారం హామీ ఇచ్చిన ప్రతి రూ.10,000కి రూ.20 టెర్మినల్ బోనస్ ఇవ్వబడుతుంది.
వాస్తవానికి 1884 ఫిబ్రవరి 1న పోస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ దేశంలోని తపాలా శాఖ ఉద్యోగుల కోసం తొలుత ప్రవేశపెట్టబడ్డాయి. అయితే 2017 తరువాత ఈ సేవలను దేశంలోని సాధారణ ప్రజలకు తపాలాశాఖ విస్తరించింది. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు.. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టయిన కంపెనీల ఉద్యోగులు దీని కింద జీవిత బీమాను పొందవచ్చు.


Click it and Unblock the Notifications