Pension News: పెన్షనర్లకు పెద్ద శుభవార్త.. ఇంటివద్దకే సరికొత్త సౌకర్యం.. పూర్తి వివరాలు..

Pension News: దేశంలో చాలా మంది పెన్షనర్లు ఉన్నారు. వారు తమ రిటైర్మెంట్ తర్వాత శేష జీవితాన్ని తమకు అందే పెన్షన్ సొమ్ముతో గడుపుతున్నారు. అయితే వీరి సౌలభ్యం కోసం కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

పెన్షనర్లు ప్రతి ఏటా అక్టోబర్ 1-నవంబర్ 30 మధ్యన తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని(Life Certificate) సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగానే వారి ఖాతాల్లోకి పెన్షన్ సొమ్ము జమచేయటం కొనసాగించబడుతుంది. 80 ఏళ్లు పైబడిన పెన్షనర్లకు అక్టోబర్ 1 నుంచి ఇది ప్రారంభమైంది. అలాగే 80-60 ఏళ్ల మధ్య సీనియర్ సిటిజన్లకు నవంబర్ 1-30 వరకు దీనిని పూర్తి చేసేందుకు గడువు ఉంది. అయితే నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు ఈ ప్రక్రియను తమ ఇంటి వద్ద నుంచే డిజిటల్ రూపంలో పూర్తి చేసేందుకు పోస్టల్ డిపార్టెమెంట్ సహాయం తీసుకోవచ్చని భారత తపాలా శాఖ వెల్లడించింది.

Good news to pensioners, can get digital life certificate with postman help

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో పోస్ట్‌ల విభాగం పోస్ట్‌మ్యాన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి డోర్‌స్టెప్ సేవను ప్రారంభించింది. దీంతో పెన్షనర్లు తమ ఇంటి వద్ద ఉన్న పోస్ట్‌మ్యాన్‌కు ఫోన్ చేసి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జారీ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం పట్టణ, గ్రామీణ తపాలా సేవకుల జాతీయ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నారు. పెన్షనర్ అభ్యర్థన చేసిన వెంటనే, సమీపంలోని పోస్టాఫీసు నుంచి పోస్ట్‌మ్యాన్ పెన్షనర్ ఇంటికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జారీ చేసే ప్రక్రియను పూర్తి చేస్తారు.

వయో భారంతో ఉన్న వృద్ధులు, వికలాంగ పెన్షనర్లకు ఇది భారీ ఊరటను అందించనుంది. ఈ సేవలను పొందాలంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వెబ్‌సైట్ https://ippbonline.com ద్వారా పోస్ట్‌మ్యాన్ మీకు కాల్ చేయాల్సిందిగా దరాఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని పెన్షనర్ PostInfo యాప్ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. పెన్షనర్ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, బ్యాంక్ లేదా పోస్టాఫీసు ఖాతా నంబర్, PPO నంబర్‌ను అందించాల్సి ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లతో పాటు, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ సంస్థ పెన్షనర్లు ఈ సేవను పొందవచ్చు. ఈ సేవల కోసం రూ.70 చెల్లిస్తే సరిపోతుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+