8th Pay Commission: దేశీయంగా చాలా కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు వేతన పెంపుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 7వ వేతన సంఘం నుంచి ఒక శుభవార్త వచ్చేసింది. డీఏ పెంపుకు గ్రీన్ సిగ్నల్ రావటంతో చాలా మంది ప్రస్తుతం తమ పెరగనున్న వేతనం, పెన్షన్ బెనిఫిట్స్ గురించి లెక్కలు వేసుకుంటున్నారు.
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులను సంతోష పెట్టడానికి డీఏను దాదాపు 3-4 శాతం మధ్యలో పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రకటన కోసమే చాలా కాలంగా పెన్షనర్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం హోలీ పండుగకు ముందే వేతన సంఘం నుంచి దీనికి సంబంధించిన వార్త రావటంతో ఖుషీగా ఉన్నారు. పెంచబడిన వేతనాలు మార్చి జీతంతో కలిపి ఉద్యోగులు అందుకోవచ్చని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ చర్య కారణంగా 48 లక్షల మంది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో పాటు దాదాపు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.

2024లో కూడా 7వ వేతన సంఘం ఉద్యోగులకు మంచి ఉపశమనాన్ని అందించింది. రెండు దఫాలుగా ఉద్యోగులకు డీఏను 7 శాతం మేర పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న వేతనంలో దాదాపు 53 శాతం డీఆర్ అందుకుంటున్నారు. జూలై నుంచి డిసెంబర్ వరకూ ఉన్న ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి 2025 డీఏ ఎంతనేది ఉంటుంది. జూలై-నవంబర్ 2024 మధ్య కాలంలో ఏఐసీపీఐ స్కోర్ 144.5 పాయింట్లకు డీఏ స్కోర్ 55.05 శాతానికి పెంచబడనుంది.
రెండవ శుభవార్త..
ఒక పక్క 7వ వేతన సంఘం డీఏ పెంపుతో ముందుకు వెళుతుండా కేంద్ర ఉద్యోగులకు మరో శుభవార్త కూడా వేచి ఉంది. అదేంటంటే మోదీ సర్కార్ ఇప్పటికే 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు వేయటం. కొన్ని రోజుల కిందట దీనికి సంబంధించిన ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. ఇది అమలులోకి వస్తే పెన్షర్లతో పాటు ఉద్యోగులకు ఎక్కువ బెనిఫిట్స్ అందనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే చాలా మంది డీఏ పెంపు కంటే కూడా 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది చివరి నాటికి 7వ వేతన సంఘం గడువు ముగుస్తుంది. అంటే దీని ప్రకారం వచ్చే సంవత్సరం నుంచి కొత్త వేతన సంఘం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్యూన్లు, అటెండర్లకు గతంలో రూ.18,000గా ఉన్న మూలవేతనం రూ.51,480కు పెరిగే పెరగవచ్చు. అలాగే సీనియర్ క్లర్క్, ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బందికి రూ.29,200గా ఉన్న బేసిక్ వేతనం రూ.83,512కు పెరిగే అవకాశం ఉంది. గ్రూప్ ఏ స్థాయి అధికారుల వేతనం రూ.56,100 నుంచి రూ.1,60,446 బేసిక్ పెరుగుతుందని తెలుస్తోంది. ఇలాగే ఇతర కేటగిరీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు సైతం పెరగవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications