Tax News: బడ్జెట్ ముందు మోదీ సర్కార్ ఖజానాకి కాసులు.. ముక్కుపిండి వసూళ్లు..!!
Tax Collection: కేంద్రంలో కొత్తగా ఏర్పాటైన ఎన్డీయే కూటమి ప్రభుత్వం త్వరలోనే తన తొలి సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ఈ క్రమంలో జూలై 11, 2024 వరకు పన్ను వసూళ్లకు సంబంధించిన గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి. మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం FY25లో ప్రభుత్వ ప్రత్యక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 24 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) డేటా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 24.07 శాతం పెరిగాయి. ఇప్పటివరకు ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు రూ.5.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

గత ఆర్థిక సంవత్సరం ఈ కాలంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4.80 లక్షల కోట్లుగా ఉన్నాయి. కార్పొరేట్ పన్ను వసూళ్లు కూడా పెరిగాయి. ఇది 11 జూలై 2024 నాటికి రూ.2.1 లక్షల కోట్లు. ఇక వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.3.46 లక్షల కోట్లుగా ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయపు పన్ను సేకరణలో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(STT) చేర్చబడింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ఎస్‌టీటీ రూ.16,634 కోట్లను అందించిందని సీబీడీటీ పేర్కొంది.
జూలై 11, 2024 వరకు రూ.70,902 కోట్ల విలువైన పన్ను రీఫండ్‌లు జారీ అయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 64.4 శాతం ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.21.99 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.


Click it and Unblock the Notifications