Job Alert: దాదాపు రెండేళ్లుగా జాబ్ మార్కెట్ కుదేలైంది. అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల తొలగింపులే తప్ప.. కొత్త నియామకాలు అనే మాటే వినిపించటం లేదు. పైగా 2023 నుంచి కొత్త ఏడాదిలో గత నెల వరకు వేల సంఖ్యలో పెద్ద కంపెనీలు సైతం తమ ఉద్యోగులను తొలగించి ఖర్చుల మదింపు మంత్రాన్ని పఠించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా మారుతున్న పరిస్థితులు ఉద్యోగార్థులకు పెద్ద ఊరటను అందిస్తున్నాయి. భారతదేశంలోని కంపెనీల యజమానులు రాబోయే జూన్ త్రైమాసికంలో నూతన నియామకాలను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మ్యాన్‌పవర్‌గ్రూప్ తాజా జాబ్స్ ఔట్‌లుక్ సర్వే దీనికి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను నివేదించింది. దేశంలోని 36 శాతం కంపెనీలు వచ్చే త్రైమాసికంలో ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు శుభవార్త చెప్పింది. 36 శాతం నికర ఉపాధి దృశ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఈ వార్త ప్రధానంగా టెక్ ఉద్యోగులకు ఊరటను కల్పిస్తోంది.

మ్యాన్‌పవర్‌గ్రూప్ సర్వే నివేదిక మంగళవారం విడుదల కావటంతో జాబ్ మార్కెట్లో కోలాహలం మెుదలైంది. సర్వేలో సదరు సంస్థ 3,150 మంది కంపెనీల యజమానులతో చర్చించి వివరాలు సేకరించింది. ప్రపంచంలోని 42 దేశాలలో భారతదేశం బలమైన రిక్రూట్‌మెంట్ దృశ్యాన్ని కలిగి ఉన్నట్లు నివేదికలో పొందుపరిచింది. సర్వే సమయంలో.. 50 శాతం మంది యజమానులు జీతం పెరుగుతుందని, 14 శాతం మంది తగ్గుతారని అంచనా వేయగా, 33 శాతం మంది ఎటువంటి మార్పు లేదని పంచుకున్నారు.
ఎయిర్‌లైన్‌లో వ్యూహాత్మక పునర్నిర్మాణంలో భాగంగా తమ వాణిజ్య బృందంలోని పలువురు సభ్యులు తక్షణమే రాజీనామా చేసినట్లు స్పైస్‌జెట్ మంగళవారం తెలిపింది. సోమవారం ఎయిర్‌లైన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరుణ్ కశ్యప్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా తమ రాజీనామాలను సమర్పించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. స్పైస్‌జెట్ వ్యూహాత్మక పునర్నిర్మాణంలో భాగంగా, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌తో సహా వాణిజ్య బృందంలోని పలువురు సభ్యులు తక్షణమే రాజీనామా చేసినట్లు ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications