IT News: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్కీలు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అయితే కొన్ని ప్రత్యేక స్కిల్స్ ఉండే టెక్కీలకు మాత్రం డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోందని నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుతం ఒక వార్త మాత్రం టెక్కీల్లో కొత్త ఆశలను చిగురింప చేస్తోంది. అదేంటంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన స్కిల్స్ ఉన్న నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ స్కిల్స్ కలిగిన ఉద్యోగుల లభ్యత తగ్గుతూ అంతరం పెరుగుతోంది. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలు కలిగిన నిపుణుల డిమాండ్ దాదాపు 30 లక్షలకు పైగా ఉన్నట్లు వెల్లడైంది.

సైబర్-సెక్యూరిటీ సంస్థ ఫోర్టినెట్ నివేదిక ప్రకారం 2022లో దాదాపు 92 శాతం భారతీయ సంస్థలు సైబర్ ఉల్లంఘనలను ఎదుర్కొన్నాయని వెల్లడైంది. 2023 గ్లోబల్ సైబర్‌సెక్యూరిటీ స్కిల్స్ గ్యాప్ రిపోర్ట్‌లో 24 శాతం భారతీయ సంస్థలు ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఉల్లంఘనలను ఎదుర్కొన్నాయని కనుగొంది. పెరుగుతున్న సైబర్ ముప్పు ల్యాండ్‌స్కేప్‌లో ముందుండడానికి, సంస్థలు సైబర్ సెక్యూరిటీ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరమని ఫోర్టినెట్ ప్రతినిధి విశాక్ రామన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం కంపెనీలు తక్కువ మంది సైబర్ సెక్యూరిటీ టీమ్ లను కలిగి ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం సైబర్ నిపుణుల కొరతగా తెలుస్తోంది. పైగా సైబర్ అటాక్స్ వల్ల కంపెనీలు భారీగా డబ్బును వెచ్చించాల్సి వస్తోందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం 69 శాతం భారతీయ సంస్థలు రాబోయే 12 నెలల్లో సైబర్‌టాక్‌ల సంఖ్య పెరుగుతాయని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ ఉన్న టెక్కీలకు బంగారు భవిష్యత్తు ముందుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications