IT Jobs: భారతదేశంలో ఎక్కువ మంది ప్రస్తుతం ఐటీ నిపుణులు ప్రతి ఏటా కాలేజీల నుంచి పట్టభద్రులు అవుతున్నారు. పైగా దేశంలో సర్వీస్ సెక్టార్ అద్భుతంగా ముందుకు సాగుతున్న వేళ చాలా మంది టెక్ రంగం వైపు మెుగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారతీయ టెక్కీలు, ఇంజనీర్లకు ఒకదేశం స్వాగతం పలుకుతోంది.
ప్రస్తుతం భారతీయులను ఆకర్షించేందుకు తైవాన్ ప్రభుత్వం కొత్తగా రెండు వీసాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో అత్యంత నైపుణ్యాలు కలిగిన నిపుణులు తైవాన్‌కు వెళ్లి ఉద్యోగాలను సులువుగా పొందటానికి ఇది మార్గం సుగమనం చేసింది. సెమీకండక్టర్ల తయారీ రంగంలో నైపుణ్యాలు కలిగిన తైవాన్ వెళ్లేందుకు ప్రస్తుతం ఇండియన్ టెక్కీలు, ఇంజనీర్లు ఆసక్తి చూపుతున్నారు. పైగా ఇండియాలో ప్రభుత్వం సెమీకండక్టర్ల ఉత్పత్తి రంగంపై భారీగా దృష్టి పెట్టడంతో పాటు కొత్త కంపెనీలు ఈ రంగంలోకి అడుగుపెట్టడం తైవాన్ వెళ్లే వారికి భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. తైవాన్ నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరతను ఎదుర్కొవటంతో అక్కడి ప్రభుత్వం ఇండియన్ ఉద్యోగుల నియామకానికి అవకాశం కల్పిస్తోంది.

కొత్త ఏడాది ప్రారంభానికి ముందే తైవాన్ ఎంప్లాయ్‌మెంట్ సీకింగ్ వీసా, ఎంప్లాయ్‌మెంట్ గోల్డ్ కార్డ్ పేరుతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐటి రంగంలో చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఈ తైవాన్ అందిస్తున్న వీసాలు జాబ్స్ అందిస్తాయి. అధిక వేతనాలను అందుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. అలాగే గోల్డ్ కార్డ్ వీసా ఇక్కడి నుంచి వేళ్లే నిపుణులకు వర్క్ పర్మిట్, నివాస అనుమతిని సులభంగా పొందేందుకు వీలు కల్పిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం తైవాన్ ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు. తైవాన్‌లో వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన కార్మికులకు డిమాండ్ ఉన్నందున తెలివిగా దీనిని టెక్కీలు వినియోగించుకోవచ్చు.
ఎంప్లాయ్‌మెంట్ గోల్డెన్ గార్డెన్ పరంగా నిపుణులు అక్కడ ఉద్యోగ అవకాశాలను పొందడమే కాకుండా సులభంగా అక్కడే స్థిరపడి స్వయం ఉపాధిని ప్రారంభించవచ్చు. ఈ వీసా మూడేళ్ల చెల్లుబాటుతో భారతీయులకు అందించబడుతోంది. అమెరికా, కెనడా, యూకే వంటి దేశాలకు వెళ్లాలని భావిస్తున్న యువత ప్రస్తుతం కొనసాగుతున్న అస్థిర పరిస్థితులు, ఐటీ పరిశ్రమ మందగమనంలో తైవాన్ అందిస్తున్న అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా సులువుగా విదేశంలో స్థిరపడాలనుకునే వ్యక్తులకు ఇది ఉత్తమ ఎంపికల్లో ఒకటిగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications