2024 News: సొంతిల్లు కట్టుకునే వారికి శుభవార్త.. 2024లో తగ్గనున్న నిర్మాణ ఖర్చులు..

Steel Prices: ప్రస్తుతం అన్నింటి ధరలు పెరిగిన కాలంలో సొంతింటి కలలను నెరవేర్చుకోవాలని భారంగా మారింది. అయితే రాబోతున్న కొత్త ఏడాదిలో ప్రజలకు పెద్ద శుభవార్త ఉంది.

ఇంటి నిర్మాణంలో ఉపయోగించే బిల్డింగ్ మెటీరియల్స్ ధరల పెరుగుదల కారణంగా చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సాధారణంగా ప్రజలు వాటి ధరలు తగ్గినప్పుడు నిర్మాణాన్ని ప్రారంభిస్తారని వేచి చూస్తుంటారు. మీరు కూడా అలాంటిదే ఏదైనా ప్లాన్ చేస్తుంటే.. ఇల్లు నిర్మించుకోవడానికి ఇదే సరైన అవకాశం. వాస్తవానికి 2024 కొత్త సంవత్సరం రాకముందే దేశంలోని వివిధ నగరాల్లో స్టీల్ రీబార్ ధరలు తగ్గాయి. వాస్తవానికి గృహ నిర్మాణ వ్యయంలో ఇది ప్రధాన భాగాన్ని కలిగి ఉంటుంది.

Good news to home construction planners as steel bars rates fell by half may reduce further

మీ కలల ఇంటిని నిర్మించుకోవాలంటే అందుకు ముందుగా లక్షల రూపాయలు వెచ్చించి భూమిని కొనుగోలు చేయాలి. ఆపై కోరిక మేరకు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు భారీ మొత్తంలో డబ్బు పెట్టాల్సి ఉంటుంది. దీనికోసం ఇటుకలు సిమెంట్ నుంచి అన్ని రకాల ఖర్చులు ఉన్నాయి. అయితే రీబార్ ధర కూడా ఇంటి నిర్మాణ వ్యయంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం రీబార్ ధరలు మరింత పడిపోయాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇటీవల ఐరన్ బార్స్ ధరలు తగ్గగా.. 2024లో మరింతగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

2022లో దీని ధరలు మండిపోయి ఆకాశాన్ని తాకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐరన్ బార్స్ ధరలు గత ఏడాది గరిష్ఠాల్లో కేవలం సగం మాత్రమే. అంటే ఐరన్ బార్స్ రేట్లు 50 శాతం తగ్గాయి. ఏప్రిల్ 2022లో టన్ను ధర జీఎస్టీతో కలిపినప్పుడు రూ.93,000 వద్ద ఉంది. 18 శాతం జీఎస్టీకి ముందర రేటు టన్నుకు రూ.78,800గా ఉంది. రానున్న ఏడాదిలో ఇంటి నిర్మాణం కోసం వినియోగించే ఐరన్ బార్ల ధరలు ఇంకా తగ్గుముఖం పడతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మీకు సమీపంలోని నగరాల్లో తాజా రేట్లను తెలుసుకోవటానికి ayronmart.com వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+