Helath Insurance: ప్రజల్లో పెరుగుతున్న ఆర్థిక అక్షరాస్యత, తడిసి మోపెడవుతున్న వైద్య ఖర్చులు వెరసి.. ఆరోగ్య బీమా తీసుకునే వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. అయితే దాని నుంచి ప్రతిఫలం పొందాలంటే బీమా కంపెనీలు సవాలక్ష కొర్రీలు పెడుతుంటాయి. వాటిలో ముఖ్యమైనది 24 గంటల హాస్పిటలైజేషన్. దీనిపై వినియోగదారుల ఫోరం కీలక తీర్పు ఇచ్చింది.
ఆరోగ్య బీమా పాలసీ ప్రయోజనాలు పొందాలంటే ఇన్స్యూరెన్స్ చేయబడిన వ్యక్తులు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. వాటిలో ఒకటి 24 గంటలపాటు హాస్పిటల్ లో ఉండాల్సి రావడం. అయితే దీనివల్ల పలువురు బీమా మొత్తాన్ని అందుకునేందుకు తరచూ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని గమనించిన కన్స్యూమర్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

మెడికల్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ కి అర్హత సాధించాలంటే 24 గంటల పాటు ఆస్పత్రిలోై ఉండాల్సిన అవసరం లేదని వడోదరలోని కన్స్యూమర్ కోర్టు స్పష్టం చేసింది. ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారంలో ప్రత్యేక నిబంధనలు అమలుచేస్తోంది. 24 గంటలు ఆస్పత్రిలో ఉండకుండానే.. డే-కేర్ కింద పొందిన వైద్య సేవలకు బీమా క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపింది.
24 గంటల్లోపు పూర్తిచేసే ఆపరేషన్స్ విషయంలో ఈ నిబంధన వర్తించదని IRDAI తెలిపింది. అనస్థీషియా వినియోగించే ఏ వైద్య సేవలైనా ఓ రోజు ఆస్పత్రిలో ఉండకుండానే క్లెయిమ్ తీసుకోవచ్చని వెల్లడించింది. అయితే కన్సల్టేషన్ ఫీజు, ఇతర పరీక్షల ఖర్చులను డే-కేర్ ట్రీట్‌మెంట్ కింద పొందడం కుదరదని వినియోగదారులు గమనించాల్సి ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications