H-1B visa: యూఎస్ వీసా హోల్డర్లకు శుభవార్త.. ఇండియన్స్‌కి త్వరలో ఆ ఫెసిలిటీ.. వావ్
Visa News: అమెరికా వెళ్లాలనే కల ఎక్కువ మంది యువతలో ఉంటుంది. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నిరంతరం వీసాల కోసం అప్లై చేసే వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. అందుకే వీసా సెంటర్లలో వెయిటింగ్ లైన్ భారీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు పెద్ద శుభవార్త ఒకటి ప్రస్తుతం ఉంది.
వివరాల్లోకి వెళితే అమెరికా త్వరలోనే వీసాల విషయంలో కొత్త ప్రోగ్రామ్ తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. దీని వల్ల భవిష్యత్తులో హెచ్1బి వీసా హోల్డర్లు దేశాన్ని విడిచివెళ్లకుండానే తమ వీసా గడువు ముగింపు సమయంలో రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఈ చర్య అమెరికాలో పనిచేస్తున్న అనేక మంది భారతీయ నిపుణులకు రానున్న కాలంలో గొప్ప సౌలభ్యాన్ని అందిస్తుందని తెలుస్తోంది. గతం నుంచి ఈ వ్యక్తులు వీసా రెన్యూవల్ ప్రక్రియను పూర్తి చేసేందుకు తిరిగి ఇండియాకు రావాల్సి వచ్చేది.

దీనికి అనుగుణంగా భారతదేశంలో యూఎస్ ఎంబసీ 2024లో పైలట్ ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమం అనేక మంది భారతీయ నిపుణులకు తమ వీసాలను సులువుగా రెన్యూవల్ చేసుకోవటంలో దోహదపడిందని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకటించింది. వీరు అమెరికాలో ఉంటూనే వారి వీసాలను అప్పట్లే రెన్యువల్ చేసుకోగలిగారు. ప్రక్రియను క్రమబద్ధీకరించటం కాన్సులేట్‌లలో అపాయింట్‌మెంట్ స్లాట్‌లను భద్రపరచడానికి సంబంధించిన సవాళ్లను తగ్గిస్తుంది. అయితే 2025లో ఈ ప్రక్రియను అధికారికంగా కొనసాగించటంపై దృష్టి పెట్టినట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.
ప్రస్తుతం అమెరికా స్కిల్ వర్కర్ల డిమాండ్ కోసం వివిధ రంగాల్లో ఈ హెచ్1బి వీసాలను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఫైనాన్స్ వంటి రంగాల్లోని నిపుణులకు మాత్రమే వీటిని ప్రస్తుతం అమెరికా అందిస్తోంది. అయితే ట్రంప్ రాకతో వీటికి అడ్డుకట్టపుడుతుందా అనే అనుమానాలు రేకెత్తినప్పటికీ ఇటీవల బిలియనీర్ ఎలాన్ మస్క్ వీటికి తన మద్ధతును తెలపటం చూస్తుంటే ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే గతంలో కంటే వీటి జారీ మరింత సంక్షిష్టంగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా అందిస్తున్న ఈ హెచ్1బి వీసాలను పొందే విషయంలో ఇండియా గడచిన కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2022లో 77%, 2023లో 72.3% మేర మెుత్తం యూఎస్ జారీ చేయబడిన వీసాల్లో భారతీయ దరఖాస్తుదారులు దక్కించుకోవటం గమనార్హం. నిరంతరం వీసాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా లాటరీ విధానం ద్వారా హెచ్1బి వీసాల జారీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీసా కోసం దరఖాస్తుదారులు 460 డాలర్లు బేసిక్ ఫీజుగా ఫైలింగ్ సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. దుర్వినియోగాన్ని అరికట్టాలనే లక్ష్యంతో మొదటిసారి దరఖాస్తు చేసుకున్నవారికి లేదా యజమానులను మార్చేవారికి 500 డాలర్లు యాంటీ-ఫ్రాడ్ రుసుము దీనికి జోడించబడింది.


Click it and Unblock the Notifications