Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. 10 రోజుల తర్వాత పడిపోయిన గోల్డ్ రేటు.. త్వరపడండి
Gold Rate Today: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్తతలు, వాతావరణ పరిణామాలతో బంగారం ధరలు గడచిన 10 రోజులుగా పుంజుకున్నాయి. దీంతో పండుగల సీజన్లో పసిడి రేట్లు పరుగులు మెుదలు పెట్టాయి. తాజాగా వీటి నుంచి కొంత ఉపసమనం లభించిందని చెప్పుకోవాలి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.310 మేర తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,300, ముంబైలో రూ.55,100, దిల్లీలో రూ.55,250, కలకత్తాలో రూ.55,100, బెంగళూరులో రూ.55,100, కేరళలో రూ.55,100, పూణేలో రూ.55,100, వడోదరలో రూ.55,150, జైపూర్ లో రూ.55,250, మధురైలో రూ.55,300, నాశిక్ లో రూ.55,130, గురుగ్రామ్ లో రూ.55,250, నోయిడాలో రూ.55,250, బళ్లారిలో రూ.55,100 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.340 తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ రేట్లను పరిగణిస్తే.. చెన్నైలో రూ.60,330, ముంబైలో రూ.60,110, దిల్లీలో రూ.60,260, కలకత్తాలో రూ.60,110, బెంగళూరులో రూ.60,110, కేరళలో రూ.60,110, పూణేలో రూ.60,110, వడోదరలో రూ.60,160, జైపూర్ లో రూ.60,260, మధురైలో రూ.60,330, నాశిక్ లో రూ.60,140, గురుగ్రామ్ లో రూ.60,260, నోయిడాలో రూ.60,260, బళ్లారిలో రూ.60,110గా ఉన్నాయి.
ఏపీ తెలంగాణ నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,100గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,110 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ రూ.77,500 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications