Gold Rates: బంగారు ఆభరణాలు కొనాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి ప్రస్తుతం సరైన కాలంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం రేట్లు మూడు నెలల కనిష్ఠానికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు కుదుటపడుతున్న వేళ గోల్డ్ దిగొస్తోంది.
ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో 10 గ్రాముల గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. దిల్లీలో రూ.54,500, ముంబైలో రూ.54,350, చెన్నైలో రూ.54,750, కలకత్తాలో రూ.54,350, బెంగళూరులో రూ.54,350, కేరళలో రూ.54,350, వడోదరలో రూ.54,400, జైపూర్ లో రూ.54,500, కోయంబత్తూరులో రూ.54,700, నాగపూర్ లో రూ.54,350, చంఢీగడ్ లో రూ.54,500, మంగళూరులో రూ.54,350, నాసిక్ లో రూ.54,380గా కొనసాగుతున్నాయి.

అయితే ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేట్లు మాత్రం నిన్నటి కంటే స్వల్పంగా తగ్గాయి. దేశంలోని వివిధ నగరాల్లో మారిన 10 గ్రాముల కొత్త ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,730, ముంబైలో రూ.59,180, దిల్లీలో రూ.59,430, కలకత్తాలో రూ.59,180, బెంగళూరులో రూ.59,280, కేరళలో రూ.59,180, పూణేలో రూ.59,180, అహ్మదాబాదులో రూ.59,330, జైపూర్ లో రూ.59,430, సూరత్ లో రూ.59,330, నాశిక్ లో రూ.59,210, బళ్లారిలో రూ.59,280, ఘజియాబాద్ లో రూ.59,430గా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలుల్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,350 ఉండగా.. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.59,180గా ఉంది. ఇదే సమయంలో తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజాంబాద్ లలో ధరలు ఇదే శ్రేణిలో కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో దేశంలో వెండి ధరలను పరిశీలిస్తే కిలోకు రూ.600 మేర పెరిగి రూ.71,500గా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వెండి ధరలను పరిశీలిస్తే కేజీ రూ.75,500గా విక్రయించబడుతున్నాయి.


Click it and Unblock the Notifications