Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త.. దిగొచ్చిన గోల్డ్ రేటు.. ఇవాళ్టి ధరలు ఇవే..
Gold Rate Today: అమెరికా వడ్డీ రేట్ల పెంపును స్థిరంగా కొనసాగించటంతో పసిడి ధరల మంటలు చల్లారాయి. దాదాపు వారంగా పెరిగిన సేఫ్ హెవెన్ గోల్డ్ తిరోగమనం బాట పట్టింది. ఇన్వెస్టర్లు బాండ్ మార్కెట్లకు సంపదను తరలించటంతో బంగారం మెరుపు తగ్గిందని నిపుణులు చెబుతున్నారు.
22 క్యారెట్ల నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.150 మేర తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,300, ముంబైలో రూ.55,050, దిల్లీలో రూ.55,200, కలకత్తాలో రూ.55,050, బెంగళూరులో రూ.55,050, కేరళలో రూ.55,050, వడోదరలో రూ.55,100, జైపూర్ లో రూ.55,200, కోయంబత్తూరులో రూ.55,300, పాట్నాలో రూ.55,100, నాశిక్ లో రూ.55,080, బళ్లారి రూ.55,050, నోయిడాలో రూ.55,200గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.180 మేర క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశంలోని అనేక ప్రాంతాలలో రిటైల్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.60,330, ముంబైలో రూ.60,050, దిల్లీలో రూ.60,200, కలకత్తాలో రూ.60,050, బెంగళూరులో రూ.60,050, కేరళలో రూ.60,050, వడోదరలో రూ.60,100, జైపూర్ లో రూ.60,200, కోయంబత్తూరులో రూ.60,330, పాట్నాలో రూ.60,100, నాశిక్ లో రూ.60,080, బళ్లారి రూ.60,050, నోయిడాలో రూ.60,200గా ఉన్నాయి.
తగ్గిన ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, విశాఖ, అనంతపురం, కడప, హైదరాబాద్, నిజాంబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.55,050 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,050గా రిటైల్ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగటంతో కిలో రేటు రూ.78,000గా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications