Gold Prices Today: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో రేట్లిలా..
Gold Prices Today: శ్రావణమాసం శుభకార్యాల కోలాహలంతో ఇటీవల కొంత మేర పెరిగిన పసిడి ధరలు మళ్లీ క్రమంగా తగ్గుతున్నాయి. బులియన్ మార్కెట్లో సైతం అంతర్జాతీయ పరిణామాల కారణంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.
దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.50 మేర ధర తగ్గింది. దీంతో వివిధ నగరాల్లో బంగారం రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.54,750, ముంబైలో రూ.54,450, దిల్లీలో రూ.54,600, కలకత్తాలో రూ.54,450, బెంగళూరులో రూ.54,450, హైదరాబాదులో రూ.54,450, కేరళలో రూ.54,450, పూణేలో రూ.54,450, వడోదరలో రూ.54,500, అహ్మదాబాదులో రూ.54,500, జైపూర్ లో రూ.54,600, మధురైలో రూ.54,750, నాశిక్ లో రూ.54,480 చొప్పున కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.50 మేర క్షీణించాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో తగ్గిన గోల్డ్ రిటైల్ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,750, ముంబైలో రూ.59,400, దిల్లీలో రూ.59,550, కలకత్తాలో రూ.59,400, బెంగళూరులో రూ.59,400, హైదరాబాదులో రూ.59,400, కేరళలో రూ.59,400, పూణేలో రూ.59,400, వడోదరలో రూ.59,450, అహ్మదాబాదులో రూ.59,450, జైపూర్ లో రూ.59,550, మధురైలో రూ.59,750, నాశిక్ లో రూ.59,430గా ఉన్నాయి.
ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం, తిరుపతి, నెల్లూరులలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,400 వద్ద విక్రయించబడుతోంది. ఇక తెలంగాణలోని హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగంల్, నిజాంబాద్ లలో నేటి ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్లకు రూ.54,450, 24 క్యారెట్లకు రూ.59,400గా ఉంది. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో వెండి రేటును గమనిస్తే.. స్థిరంగా కిలోకు రూ.80,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications