Gold News Today: బంగారం ధరలు దేశంలో 6 నెలల గరిష్ఠాలకు చేరుకోవటంతో అందరిలోనూ ఆందోళనలు నెలకొన్నాయి. సామాన్యుల ఊహలకు అందనంత వేగంగా పెరిగిన పసిడి ధరలు నేడు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఆభరణాలు కొనాలనుకునేవారిలో కొత్త ఉత్సాహం మెుదలైంది.
22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.600 క్షీణతను నమోదు చేసింది. దీంతో నేడు ప్రధాన నగరాల్లో తగ్గిన రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,650, ముంబైలో రూ.57,500, దిల్లీలో రూ.57,650, కలకత్తాలో రూ.57,500, కేరళలో రూ.57,500, వడోదరలో రూ.57,550, పూణేలో రూ.57,500, జైపూర్‌లో రూ.57,650, కోయంబత్తూరులో రూ.58,650, మంగళూరులో రూ.57,500, నాశిక్ లో రూ.57,350, బళ్లారిలో రూ.57,500, గురుగ్రామ్‌లో రూ.57,650, నోయిడాలో రూ.57,650 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలను పరిశీలిస్తే 10 గ్రాములకు రూ.650 తగ్గింది. దీంతో ముఖ్యమైన నగరాల్లో రిటైల్ ధరలను చూస్తే.. చెన్నైలో రూ.63,980, ముంబైలో రూ.62,730, దిల్లీలో రూ.62,880, కలకత్తాలో రూ.62,730, కేరళలో రూ.62,730, వడోదరలో రూ.62,780, పూణేలో రూ.62,730, జైపూర్‌లో రూ.62,880, కోయంబత్తూరులో రూ.63,980, మంగళూరులో రూ.62,730, నాశిక్ లో రూ.62,760, బళ్లారిలో రూ.62,730, గురుగ్రామ్‌లో రూ.62,880, నోయిడాలో రూ.62,880గా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, కడప, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, అనంతపురం, విశాఖ, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,500గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రేటు రూ.62,730గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీ ధర స్థిరంగా రూ.82,200గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications