Gold Rate Today: శిఖరం అంచుల నుంచి కిందపడ్డ బంగారం.. భారీగా తగ్గిన పసిడి రేట్లివే..
Gold Rate Today: చాలాకాలం ర్యాలీ తర్వాత బంగారం ధరలు వరుసగా భారీ క్షీణతను నమోదు చేస్తున్నాయి. ఇది పసిడి ప్రియులను సంతోషానికి గురిచేస్తోంది. ఆభరణాలు కొనుగోలుకుంటున్నట్లయితే వెంటనే ఇవాళ్టి రేట్లు పరిశీలించండి.
ఒకవారం ముందర ఎవరెస్ట్ శిఖరాన్ని తాకేందుకు వేగంగా పెరిగిన పసిడి ప్రస్తుతం పాతాళానికి ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధరలు 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.250 మేర తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.54,800, ముంబైలో రూ.54,500, దిల్లీలో రూ.54,650, కలకత్తాలో రూ.54,500, కేరళలో రూ.54,500, వడోదరలో రూ.54,550, జైపూర్ లో రూ.54,650, కోయంబత్తూరులో రూ.54,800, నాశిక్ లో రూ.54,530, మైసూరులో రూ.54,500, గురుగ్రామ్ లో రూ.54,650, నోయిడాలో రూ.54,650 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.280 మేర క్షీణించింది. దీంతో వివిధ నగరాల్లో తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,780, ముంబైలో రూ.59,540, దిల్లీలో రూ.59,600, కలకత్తాలో రూ.59,450, కేరళలో రూ.59,450, వడోదరలో రూ.59,500, జైపూర్ లో రూ.59,600, కోయంబత్తూరులో రూ.59,780, నాశిక్ లో రూ.59,480, మైసూరులో రూ.59,450, గురుగ్రామ్ లో రూ.59,600, నోయిడాలో రూ.59,600గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ, అనంతపురం, కాకినాడ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,500, 24 క్యారెట్ల బంగారం రేటు రూ.59,450 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీకి రూ.600 తగ్గి రూ.77,000 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications