Gold Silver Price Today: శుభవార్త.. దాదాపు వారం రోజుల నుంచి బంగారం ధరలు పడిపోవటం కొనసాగుతోంది. వెండి సైతం దాదాపుగా ఇదే దారిలో పయనిస్తోంది. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా పసిడి ధరలు పడిపోయి సామాన్యులకు షాపింగ్ అవకాశం కల్పించింది.
22 క్యారెట్ల బంగారం ధరలు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.100 మేర తగ్గాయి. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలు సైతం దిగివచ్చాయి. స్వాతంత్ర్య దినోత్సవం రోజు షాపింగ్ చేసే వారు ముందుగా మారిన రేట్లు గమనించాల్సి ఉంటుంది. చెన్నైలో రూ.55,000, ముంబైలో రూ.54,550, దిల్లీలో రూ.54,700, కలకత్తాలో రూ.54,550, బెంగళూరులో రూ.54,550, కేరళలో రూ.54,550, వడోదరలో రూ.54,600, జైపూర్ లో రూ.54,700, నాశిక్ లో రూ.54,580 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధర సైతం 10 గ్రాములకు రూ.110 తగ్గింది. తాజాగా తగ్గిన రిటైల్ రేట్లను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో గమనిస్తే.. ముందుగా చెన్నైలో రూ.60,000, ముంబైలో రూ.59,510, దిల్లీలో రూ.59,660, కలకత్తాలో రూ.59,510, బెంగళూరులో రూ.59,510, కేరళలో రూ.59,510, వడోదరలో రూ.59,560, జైపూర్ లో రూ.59,660, నాశిక్ లో రూ.59,540 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖ, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, కాకినాడలలో 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.54,550గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.59,510గా కొనసాగుతోంది. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ లలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతూ తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కిలో రూ.76,000 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications