Gold Rate: శుభవార్త.. క్రిస్టమస్ ముందు గోల్డ్ రేట్ల పతనం, షాపులకు పరుగులు..
Gold Price Today: దేశీయంగా పసిడి ధరలు గడచిన వారం చివరి నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ రేట్లు తగ్గుదలను చూశాయి. దీంతో స్థిరంగా రేట్ల పతనం కొనుగోలుదారులను ప్రేరేపించటంతో చాలా మంది రిటైల్ కొనుగోలుదారులు దేశవ్యాప్తంగా క్రిస్మస్ పండుగకు ముందు షాపింగ్ చేయటానికి పరిగెడుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1000 తగ్గుదలను నమోదు చేసింది. క్రిస్టమస్ పండుగకు ముందు రోజు దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7090, ముంబైలో రూ.7090, దిల్లీలో రూ.7105, కలకత్తాలో రూ.7090, బెంగళూరులో రూ.7090, కేరళలో రూ.7090, వడోదరలో రూ.7095, అహ్మదాబాదులో రూ.7095, జైపూరులో రూ.7105, లక్నోలో రూ.7105, కోయంబత్తూరులో రూ.7090, మంగళూరులో రూ.7090, నాశిక్ లో రూ.7093, అయోధ్యలో రూ.7105, బళ్లారిలో రూ.7090, గురుగ్రాములో రూ.7105, నోయిడాలో రూ.7105 వద్ద కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.7735, ముంబైలో రూ.7735, దిల్లీలో రూ.7750, కలకత్తాలో రూ.7735, బెంగళూరులో రూ.7735, కేరళలో రూ.7735, వడోదరలో రూ.7740, అహ్మదాబాదులో రూ.7740, జైపూరులో రూ.7750, లక్నోలో రూ.7750, కోయంబత్తూరులో రూ.7735, మంగళూరులో రూ.7735, నాశిక్ లో రూ.7738, అయోధ్యలో రూ.7750, బళ్లారిలో రూ.7735, గురుగ్రాములో రూ.7750, నోయిడాలో రూ.7750 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7095గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7735 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.98,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications