Gold Price Today: పసిడి ధరలు ఇటీవల వరుసగా పెరుగుతూ భారతీయ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో నేడు రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి.
22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.350 మేర పతనమైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నేటి తాజా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,500, ముంబైలో రూ.55,100, దిల్లీలో రూ.55,250, కలకత్తాలో రూ.55,100, బెంగళూరులో రూ.55,100, కేరళలో రూ.55,100, పూణేలో రూ.55,100, వడోదరలో రూ.55,150, జైపూర్ లో రూ.55,250, లక్నోలో రూ.55,250, కోయంబత్తూరులో రూ.55,500, నాగపూర్ లో రూ.55,100, సూరత్ లో రూ.55,150, గురుగ్రామ్ లో రూ.55,250 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.380 తగ్గింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి తాజా గోల్డ్ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,550, ముంబైలో రూ.60,110, దిల్లీలో రూ.60,260, కలకత్తాలో రూ.60,110, బెంగళూరులో రూ.60,110, కేరళలో రూ.60,110, పూణేలో రూ.60,110, వడోదరలో రూ.60,160, జైపూర్ లో రూ.60,260, లక్నోలో రూ.60,260, కోయంబత్తూరులో రూ.55,500, నాగపూర్ లో రూ.60,110, సూరత్ లో రూ.60,160, గురుగ్రామ్ లో రూ.60,260 వద్ద విక్రయించబడుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. ఏపీలో పసిడి 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,100 ఉండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.60,110గా కొనసాగుతోంది. తెలంగాణలోని నగరాల్లో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణలో నేడు వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.2,000 తగ్గిన తర్వాత రూ.79,500గా ఉంది.


Click it and Unblock the Notifications