Gold Price Today: అక్షయతృతీయ తర్వాత అనూహ్యంగా పసిడి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో వరుసగా మూడో రోజు కూడా ధరల్లో పతనం కొనసాగింది. వాస్తవానికి నిన్నటి వరకు స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధర నేడు భారీ క్షీణతను నమోదు చేసింది.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.4,000 తగ్గాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,900, ముంబైలో రూ.66,750, దిల్లీలో రూ.66,900, కలకత్తాలో రూ.66,750, బెంగళూరులో రూ.66,750, కేరళలో రూ.66,750, వడోదరలో రూ.66,800, జైపూరులో రూ.66,900, మంగళూరులో రూ.66,750, నాశిక్ లో రూ.67,780, అయోధ్యలో రూ.66,900, బళ్లారిలో రూ.66,750, గురుగ్రాములో రూ.66,900, నోయిడాలో రూ.66,900 వద్ద కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4,300 భారీ పతనాన్ని నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.72,980, ముంబైలో రూ.72,820, దిల్లీలో రూ.72,970, కలకత్తాలో రూ.72,820, బెంగళూరులో రూ.72,820, కేరళలో రూ.72,820, వడోదరలో రూ.72,870, జైపూరులో రూ.72,970, మంగళూరులో రూ.72,820, నాశిక్ లో రూ.72,850, అయోధ్యలో రూ.72,970, బళ్లారిలో రూ.72,820, గురుగ్రాములో రూ.72,970, నోయిడాలో రూ.72,970గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,820 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.700 పెరిగి రూ.90,700 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications