Gold Rate Today: లలితా జ్యూవెలర్స్, జాయ్‌అలూకాస్, జీఆర్టీలలో గోల్డ్ నేటి రేట్లు ఇవే..?
చాలా కాలం తర్వాత బంగారం ధరలు నేడు భారీగా పతనం అయ్యాయి. ధన త్రయోదశి, దీపావళి సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలు తమకు ఎంతో ప్రీతిపాత్రమైన పసిడిని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్న సమయంలో రేట్ల పతనం భారీ ఊరటను అందిస్తోంది.
ప్రధానంగా నిన్నటితో పోల్చితే తగ్గిన పసిడి ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.450 క్షీణించింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర నేడు మార్కెట్లో 10 గ్రాములకు రూ.490 తగ్గింపులో అందుబాటులో ఉంది. దీంతో ప్రజలు తమ పండుగల షాపింగ్ మెుదలు పెట్టి షాపులకు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఆభరణాల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

దేశంలోని కొన్ని ప్రముఖ జ్యూవెలరీ రిటైల్ వర్తకుల షోరూమ్ లలో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. (1 గ్రాముకు)
లలితా జ్యూవెలర్స్: 22 క్యారెట్ల ధర రూ.5,555
జాయ్ అలూకాస్: 22 క్యారెట్ల ధర రూ.5,555
జీఆర్టీ జ్యూవెలర్స్: 22 క్యారెట్ల ధర రూ.5,555
కల్యాణ్ జ్యూవెలర్స్: 22 క్యారెట్ల ధర రూ.5,600
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్: 22 క్యారెట్ల ధర రూ.5,555
టాటా తనిష్క్: 22 క్యారెట్ల ధర రూ.5,770
రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కడప, కాకినాడ, గుంటూరు, విశాఖ, హైదరాదాబ్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,550 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60,630గా కొనసాగుతోంది. ప్రస్తుతం ధరలు మరింతగా తగ్గితే వినియోగదారులు పండుగకు ఎక్కువ మెుత్తంలో షాపింగ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications