Gold Rate Today: అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా బంగారం ధరలు అనేక రోజులుగా వరుసగా పెరుగిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఈ దూకుడుకు బ్రేక్ పడింది. దీంతో భారతీయ పసిడి కొనుగోలు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది దీపావళి షాపింగ్ షురూ చేస్తున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నేడు 10 గ్రాములకు రూ.210 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,350, ముంబైలో రూ.57,200, దిల్లీలో రూ.57,350, కలకత్తాలో రూ.57,200, బెంగళూరులో రూ.57,200, వడోదరలో రూ.57,250, జైపూర్‌లో రూ.57,350, కోయంబత్తూరులో రూ.57,350, మంగళూరులో రూ.57,200, నాశిక్‌లో రూ.57,230, బళ్లారిలో రూ.57,200, గురుగ్రామ్‌లో రూ.57,350, నోయిడాలో రూ.57,350గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.230 మేర తగ్గింది. అనేక ప్రముఖ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.62,560, ముంబైలో రూ.62,400, దిల్లీలో రూ.62,550, కలకత్తాలో రూ.62,400, బెంగళూరులో రూ.62,400, వడోదరలో రూ.62,450, జైపూర్‌లో రూ.62,550, కోయంబత్తూరులో రూ.62,560, మంగళూరులో రూ.62,400, నాశిక్‌లో రూ.62,430, బళ్లారిలో రూ.62,400, గురుగ్రామ్‌లో రూ.62,550, నోయిడాలో రూ.62,550 వద్ద ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోని విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, అనంతపురం, విశాఖ, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,200 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.62,400గా కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలను పరిశీలిస్తే కేజీకి రూ.1,000 పెరిగిన రూ.78,500గా రిటైల్ మార్కెట్లో విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications