Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. గణేష్ చతుర్థికి కొనుక్కోండి..
Gold Price Today: పండుగల సమయం దగ్గర పడుతోంటే పసిడి ప్రియులకు మంచి కాలం వచ్చింది. గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు క్రమంగా తగ్గుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో కేంద్రం, రిజర్వు బ్యాంక్ కూడా గోల్డ్ బాండ్స్ రెండో విడత విక్రయాలను ప్రారంభించాయి.
22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి పోల్చితే 10 గ్రాములకు స్వల్పంగా రూ.10 తగ్గింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,150, ముంబైలో రూ.54,840, దిల్లీలో రూ.54,990, కలకత్తాలో రూ.54,840, బెంగళూరులో రూ.54,840, కేరళలో రూ.54,840, పూణేలో రూ.54,840, వడోదరలో రూ.54,890, జైపూర్ లో రూ.54,990, లక్నోలో రూ.54,990, పాట్నాలో రూ.54,890, నాశిక్ లో రూ.54,870గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే రూ.10 తగ్గుదలను నమోదు చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బంగారం రిటైల్ విక్రయ ధరలను పరిగణిస్తే.. చెన్నైలో రూ.60,160, ముంబైలో రూ.59,830, దిల్లీలో రూ.59,990, కలకత్తాలో రూ.59,830, బెంగళూరులో రూ.59,830, కేరళలో రూ.59,830, పూణేలో రూ.59,830, వడోదరలో రూ.59,880, జైపూర్ లో రూ.94,990, లక్నోలో రూ.59,990, పాట్నాలో రూ.59,880, నాశిక్ లో రూ.59,860గా ఉన్నాయి.
ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విశాఖ, అనంతపురం, గుంటూరు, కడప, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మంలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,840 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.59,830 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే కిలో వెండి ధరలను పరిశీలిస్తే.. నిన్నటి కంటే కిలోకు రూ.500 పెరిగిన తర్వాత రేటు రూ.77,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications