Gold Price Today: గుడ్‌న్యూస్.. వరుసగా మూడో రోజు భారీగా పసిడి ధరలు తగ్గటం భారతీయ కొనుగోలుదారులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్నికల ఫలితాలకు తోడు పసిడి పరుగులకు బ్రేక్ పడటంతో ఆభరణాల కొనుగోలుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారు.
22 క్యారెట్ల 100 గ్రాముల పసిడి ధరలు నిన్నటి కంటే నేడు ఏకంగా రూ.2000 భారీ తగ్గింపును నమోదు చేశాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాము రేటు చెన్నైలో రూ.6,725, ముంబైలో రూ.6,660, దిల్లీలో రూ.6,675, కలకత్తాలో రూ.6,660, బెంగళూరులో రూ.6,660, కేరళలో రూ.6,660, వడోదరలో రూ.6,665, జైపూరులో రూ.6,675, మంగళూరులో రూ.6,660, నాశిక్‌లో రూ.6,663, బళ్లారిలో రూ.6,660, గురుగ్రాములో రూ.6,675, నోయిడాలో రూ.6,675గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 100 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా రూ.2,200 భారీ క్షీణతను నమోదు చేసింది. దీంతో దేశంలోని ముఖ్యమైన నగరాల్లో తగ్గిన తాజా రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే గ్రాముకు.. చెన్నైలో రూ.7,336, ముంబైలో రూ.7,265, దిల్లీలో రూ.7,280, కలకత్తాలో రూ.7,265, బెంగళూరులో రూ.7,265, కేరళలో రూ.7,265, వడోదరలో రూ.7,270, జైపూరులో రూ.7,280, మంగళూరులో రూ.7,265, నాశిక్‌లో రూ.7,268, బళ్లారిలో రూ.7,265, గురుగ్రాములో రూ.7,280, నోయిడాలో రూ.7,280గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,660గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,265 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.2,300 తగ్గి రూ.96,200 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications