Gold Price Today: గతవారం కొంత వేగంగా పెరిగిన బంగారం ధరలు చల్లబడ్డాయి. తాజాగా రెండు రోజులుగా గోల్డ్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. వారాంతంలో పసిడి పరుగులు ఆగటంతో చాలా మంది షాపింగ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.250 తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పసిడి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,550, ముంబైలో రూ.55,150, దిల్లీలో రూ.55,300, కలకత్తాలో రూ.55,150, బెంగళూరులో రూ.55,150, కేరళలో రూ.55,150, పూణేలో రూ.55,150, వడోదరలో రూ.55,200, జైపూర్ లో రూ.55,300, కోయంబత్తూరులో రూ.55,550, నాగపూర్ లో రూ.55,150, సూరత్ లో రూ.55,200, నాశిక్ లో రూ.55,180 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలను పరిశీలిస్తే 10 గ్రాములకు రూ.280 తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ గోల్డ్ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.60,600, ముంబైలో రూ.60,160, దిల్లీలో రూ.60,320, కలకత్తాలో రూ.60,160, బెంగళూరులో రూ.60,160, కేరళలో రూ.60,160, పూణేలో రూ.60,160, వడోదరలో రూ.60,220, జైపూర్ లో రూ.60,320, కోయంబత్తూరులో రూ.60,600, నాగపూర్ లో రూ.60,160, సూరత్ లో రూ.60,220, నాశిక్ లో రూ.60,190 వద్ద ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురంలలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,160 వద్ద విక్రయించబడుతోంది. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో సైతం ఇవే ధరలకు రిటైల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధరలను పరిశీలిస్తే కిలో రూ.80,500 వద్ద రిటైల్ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications