Gold Price Today: గత వారం నుంచి కొనసాగుతున్న ధరల ర్యాలీకి బంగారం బ్రేకులు వేసింది. ఒక్కసారిగా నేడు పసిడి ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. శ్రావణమాసం షాపింగ్ చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయంగా చెప్పుకోవచ్చు.
నిన్నటి కంటే 22 క్యారెట్ల బంగారం ధరలు నేడు 10 గ్రాములకు రూ.150 మేర తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,450, ముంబైలో రూ.55,150, దిల్లీలో రూ.55,300, కలకత్తాలో రూ.55,150, బెంగళూరులో రూ.55,150, కేరళలో రూ.55,150, వడోదరలో రూ.55,200, జైపూర్ లో రూ.55,300, కోయంబత్తూరులో రూ.55,450, పూణేలో రూ.55,150, పాట్నాలో రూ.55,200, సూరత్ లో రూ.55,200, నాశిక్ లో రూ.55,180గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.160 మేర తగ్గుదలను నమోదు చేసింది. దీంతో రిటైల్ మార్కెట్లో ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,490, ముంబైలో రూ.60,160, దిల్లీలో రూ.60,310, కలకత్తాలో రూ.60,160, బెంగళూరులో రూ.60,160, కేరళలో రూ.60,160, వడోదరలో రూ.60,210, జైపూర్ లో రూ.60,310, కోయంబత్తూరులో రూ.60,490, పూణేలో రూ.60,160, పాట్నాలో రూ.60,210, సూరత్ లో రూ.60,210, నాశిక్ లో రూ.60,190గా కొనసాగుతున్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు షాపింగ్ చేసేముందు తప్పకుండా ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలించాల్సిందే. హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కాకినాడ, గుంటూరు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో నేటి ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల బంగారం రూ.55,150 వద్ద విక్రయించబడుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.60,160గా కొనసాగుతోంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.1,000 తగ్గిన తర్వాత రూ.79,000గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications