Gold Price Today: గతవారం భారీ పెరుగుదల తర్వాత బ్రేక్ తీసుకున్న పిసిడి ధరలు కొత్తవారంలో కొనుగోలుదారులకు ఉత్తేజం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న పెళ్లిళ్ల సీజన్ కోసం గోల్డ్ షాపింగ్ చేయాలని చూస్తున్న అనేక మందికి ప్రస్తుత తగ్గుదల కొనుగోలుకు సదవకాశం కల్పిస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.2000 తగ్గింపును నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6800, ముంబైలో రూ.6745, దిల్లీలో రూ.6760, కలకత్తాలో రూ.6745, బెంగళూరులో రూ.6745, కేరళలో రూ.6745, జైపూరులో రూ.6760, వడోదరలో రూ.6750, లక్నోలో రూ.6760, నాశిక్ లో రూ.6748, అయోధ్యలో రూ.6760, బళ్లారిలో రూ.6745, గురుగ్రాములో రూ.6760, నోయిడాలో రూ.6760 వద్ద అమ్మకాలు కొనసాగుతున్నాయి. వీటికి జీఎస్టీ, తరుగు, తయారీదారుల లాభాలు అదనంగా ఉంటాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2200 తగ్గింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7418, ముంబైలో రూ.7358, దిల్లీలో రూ.7373, కలకత్తాలో రూ.7358, బెంగళూరులో రూ.7358, కేరళలో రూ.7358, జైపూరులో రూ.7373, వడోదరలో రూ.7363, లక్నోలో రూ.7373, నాశిక్ లో రూ.7361, అయోధ్యలో రూ.7373, బళ్లారిలో రూ.7358, గురుగ్రాములో రూ.7373, నోయిడాలో రూ.7373గా విక్రయించబడుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6745గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7358 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.200 పెరిగి రూ.99,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications