Gold Rate: సోమవారం తగ్గిన గోల్డ్ రేటు.. నేడు ఏపీ-తెలంగాణలో తులం రేటెంతంటే..?
Gold Price Today: గడచిన వారం బంగారం అన్నంతపని చేసి చూపించింది. దీంతో స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 3000 డాలర్ల మార్కును అధిగమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే నేడు పసిడి ధరలు చిన్న బ్రేక్ తీసుకుని ముందుకు సాగుతున్నాయి. దీంతో నేడు దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను తెలుసుకుని షాపింగ్ చేయటం ఉత్తమం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.1000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8210, ముంబైలో రూ.8210, దిల్లీలో రూ.8225, కలకత్తాలో రూ.8210, కేరళలో రూ.8210, బెంగళూరులో రూ.8210, వడోదరలో రూ.8215, జైపూరులో రూ.8225, మంగళూరులో రూ.8210, నాశిక్ లో రూ.8213, అయోధ్యలో రూ.8225, బళ్లారిలో రూ.8210, గురుగ్రాములో రూ.8225, నోయిడాలో రూ.8225 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1100 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8956, ముంబైలో రూ.8956, దిల్లీలో రూ.8971, కలకత్తాలో రూ.8956, కేరళలో రూ.8956, బెంగళూరులో రూ.8956, వడోదరలో రూ.8961, జైపూరులో రూ.8971, మంగళూరులో రూ.8956, నాశిక్ లో రూ.8959, అయోధ్యలో రూ.8971, బళ్లారిలో రూ.8956, గురుగ్రాములో రూ.8971, నోయిడాలో రూ.8971గా ఉన్నాయి. అయితే ఈ ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి, వ్యాపారి లాభాలు వంటివి కలపకముందువిగా గుర్తుంచుకోవాలి.

మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.8210గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8956 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8210గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8956 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,11,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications