Gold Rate: శనివారం శాంతించిన పసిడి ధరలు.. నేడు రూ.1100 తగ్గిన గోల్డ్ రేటు, ఏపీ-తెలంగాణలో ధరలివే
Gold Price Today: గడచిన రెండు రోజులుగా పెరుగుతూ నిద్రలేకుండా చేసిన పసిడి ధరలు నేడు తిరిగి తగ్గటం ప్రారంభించింది. ఈరోజు తగ్గిన గోల్డ్ రేట్లు ఆదివారం వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయి. దీంతో చాలా మంది భారతీయ కొనుగోలుదారులు వారాంతంలో తమ ఆభరణాల షాపింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ ధరలను పరిశీలించండి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1000 తగ్గుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7150, ముంబైలో రూ.7150, దిల్లీలో రూ.7165, కలకత్తాలో రూ.7150, బెంగళూరులో రూ.7150, కేరళలో రూ.7150, వడోదరలో రూ.7155, అహ్మదాబాదులో రూ.7155, జైపూరులో రూ.7165, లక్నోలో రూ.7165, కోయంబత్తూరులో రూ.7150, మంగళూరులో రూ.7150, నాశిక్ లో రూ.7153, అయోధ్యలో రూ.7165, బళ్లారిలో రూ.7150, గురుగ్రాములో రూ.7165, నోయిడాలో రూ.7165 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1,100 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7800, ముంబైలో రూ.7800, దిల్లీలో రూ.7165, కలకత్తాలో రూ.7800, బెంగళూరులో రూ.7800, కేరళలో రూ.7800, వడోదరలో రూ.7805, అహ్మదాబాదులో రూ.7805, జైపూరులో రూ.7815, లక్నోలో రూ.7815, కోయంబత్తూరులో రూ.7800, మంగళూరులో రూ.7800, నాశిక్ లో రూ.7803, అయోధ్యలో రూ.7815, బళ్లారిలో రూ.7800, గురుగ్రాములో రూ.7815, నోయిడాలో రూ.7815గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7800 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7800 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,00,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications